కర్ణాటక అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ విజయంలో కీలక పాత్ర పోషించిన ఎన్నికల వ్యూహకర్త సునీల్ కానుగోలుకు కీలక పదవి అప్పజెప్పింది కాంగ్రెస్ అధిష్టానం. ముఖ్యమంత్రి సిద్ధరామయ్యకు ముఖ్య సలహాదారుగా సునీల్ కానుగోలును నియమించినట్లు అధికారులు బుధవారం తెలిపారు.

Poll strategist Kanugolu likely to be Karnataka CM’s adviser
కర్ణాటక అసెంబ్లీ ఎన్నికల్లో(Karnataka Assembly Elections) కాంగ్రెస్(Congress) విజయంలో కీలక పాత్ర పోషించిన ఎన్నికల వ్యూహకర్త సునీల్ కానుగోలు(Sunil Kanugolu) కు కీలక పదవి అప్పజెప్పింది కాంగ్రెస్ అధిష్టానం. ముఖ్యమంత్రి సిద్ధరామయ్య(CM Siddaramaiah)కు ముఖ్య సలహాదారు(Chief Advisor)గా సునీల్ కానుగోలును నియమించినట్లు అధికారులు బుధవారం తెలిపారు. అధికారులు తెలిపిన వివరాల ప్రకారం.. సునీల్ కానుగోలు ప్రధాన సలహాదారు(Rank of a Cabinet Minister)గా తన కొత్త పాత్ర నిర్వహించబోతున్నారు. ఆయన కొత్త బాధ్యత ద్వారా.. ముఖ్యమంత్రి సమర్థవంతమైన నిర్ణయాలు తీసుకుని.. పాలన సులభంగా చేసేందుకు మార్గదర్శకత్వం అందించనున్నారని పేర్కొన్నారు.
బళ్లారి(Bellary)కి చెందిన సునీల్ కానుగోలుకు ఎన్నికల వ్యూహకర్త ప్రశాంత్ కిషోర్(Prashant Kishore)తో గతంలో అనుబంధం ఉండేది. గత ఏడాది ఏప్రిల్ 26న ప్రశాంత్ కిషోర్ కాంగ్రెస్ పార్టీలో చేరే ప్రతిపాదనను తిరస్కరించిన అనంతరం.. దేశంలో వివిధ రాష్ట్రాలలో ఎన్నికల కోసం పార్టీని సన్నద్ధం చేసేందుకు.. ఎన్నికల వ్యూహాలలో సాయం కోసం సునీల్ కానుగోలుకు కాంగ్రెస్ బాధ్యతలు అప్పజెప్పింది. కర్ణాటక ఎన్నికలకు(Karnataka polls) ముందు కాంగ్రెస్ ప్రచార వ్యూహాన్ని(Campaign Strategy) రూపొందించడంలో సునీల్ కానుగోలు కీలక పాత్ర పోషించారు.
