ఒడిశాలోని(Odisa) బాలాసోర్(Balasor) జిల్లాలో పోలీసులు ఆవు పేడ(Cow dung) కుప్పలో దాచిన రూ. 20 లక్షల నగదును స్వాధీనం(Money) చేసుకున్నారు.
ఒడిశాలోని(Odisa) బాలాసోర్(Balasor) జిల్లాలో పోలీసులు ఆవు పేడ(Cow dung) కుప్పలో దాచిన రూ. 20 లక్షల నగదును స్వాధీనం(Money) చేసుకున్నారు. హైదరాబాద్‌లోని(Hyderabad) ఓ కంపెనీ నుంచి లాకర్ నుంచి గోపాల్ బెహెరా(Gopal behera) అనే వ్యక్తి చోరీ చేసి దానిని తన గ్రామానికి పంపించాడు. నిందితుడు బెహరా అతనికి సహకరించిన వ్యక్తి ప్రస్తుతం పరారీలో ఉన్నారు. హైదరాబాద్, ఒడిశా నుంచి వచ్చిన పోలీసు బృందాలు జరిపిన దాడిలో బాలాసోర్ జిల్లాలోని ఒక గ్రామంలో ఆవు పేడ కుప్ప నుండి భారీ మొత్తంలో నగదు స్వాధీనం చేసుకున్నట్లు పోలీసులు తెలిపారు. కమర్డ పోలీస్‌స్టేషన్ పరిధిలోని బాదమందరుని గ్రామంలో రికవరీ చేసినట్లు ప్రకటించారు. ప్రస్తుతం పరారీలో ఉన్న గోపాల్ హైదరాబాద్‌లోని వ్యవసాయ ఆధారిత కంపెనీలో పనిచేస్తూ కంపెనీ లాకర్‌లో ఉన్న రూ.20 లక్షలకుపైగా చోరీకి పాల్పడ్డాడు. ఆ డబ్బును తన బావ రవీంద్ర బెహెరా ద్వారా గ్రామానికి పంపించాడు. దీంతో పోలీసులకు ఫిర్యాదు చేయగా కేసు నమోదు చేసుకొని ఒడిశాలోని గోపాల్ బెహెరా అత్తమామల ఇంటిపై దాడి చేశారు. అక్కడ ఆవు పేడ కుప్పలో దాచిన భారీ మొత్తాన్ని స్వాధీనం చేసుకున్నారు. నిందితుల కుటుంబ సభ్యులలో ఒకరిని అదుపులోకి తీసుకున్నామని విచారణ జరుగుతోందని పోలీసులు తెలిపారు