పోలీసు వ్యవస్థపై ప్రజలకు ఎనలేని నమ్మకం ఉంటుంది. తమకు ఏదైనా అన్యాయం జరిగితే ఈ వ్యవస్థనే కాపాడుతుందని ప్రజలు గట్టిగా విశ్వసిస్తారు.
పోలీసు వ్యవస్థపై ప్రజలకు ఎనలేని నమ్మకం ఉంటుంది. తమకు ఏదైనా అన్యాయం జరిగితే ఈ వ్యవస్థనే కాపాడుతుందని ప్రజలు గట్టిగా విశ్వసిస్తారు. పారదర్శకంగా పనిచేస్తే పోలీసు డిపార్ట్‌మెంట్‌పై కూడా గౌరవం పెరుగుతుంది. ఇలాంటి వ్యవస్థను కొందరు చీడ పురుగులు భ్రష్టుపట్టిస్తున్నారు. మహిళలను, మైనర్ బాలికలని చూడకుండా వారిపై అఘాయిత్యాలకు ఒడిగడుతున్నారు. తాజాగా తోటి స్నేహితుడి కూతురుపై కన్నేసిన ఓ పోలీసు, తన ఇంటికి పిలిపించుకుని అత్యాచారానికి పాల్పడ్డాడు. వివరాల్లోకి వెళ్తే..
ఈ ఘటన తమిళనాడులో(Tamilnadu) చోటుచేసుకుంది. తమిళనాడు రాష్ట్రం కళ్లకురిచ్చి(kallakurichi) జిల్లా ఉలుందూరుపేటకు చెందిన తిరునావుక్కరసు (34).. మైలాడుతురై జిల్లా, తరంగంబాడి తాలూకా, పెరంబూర్ పోలీస్ స్టేషన్‌లో కానిస్టేబుల్‌గా పనిచేస్తున్నాడు. అతడి భార్య, ముగ్గురు కొడుకులు స్వగ్రామంలో ఉంటున్నారు. తిరునావుక్కరసు పెరంబూర్ గార్డ్ క్వార్టర్స్‌లో నివసిస్తున్నాడు. ఈ సమయంలోనే అక్కడ ఓ వ్యక్తితో పరిచయం ఏర్పడింది. వీరిద్దరూ తరచూ ఫోన్‌లో మాట్లాడుకునేవారు. ఈ క్రమంలో స్నేహితుడి 16 ఏళ్ల కుమార్తెతో తిరునావుక్కరసుకు పరిచయం ఏర్పడింది. ఈ క్రమంలోనే బాలికను ఓ రోజు తన ఇంటికి పిలిపించుకున్నాడు. తనను మభ్యపెట్టి ఇంటికి తీసుకెళ్లాడు. ఆ బాలికతో బలవంతంగా మద్యం కూడా సేవించాడు. మద్యం మత్తులో బాలికపై ఘాతుకానికి పాల్పడ్డాడు. బాలికపై అత్యాచారం చేశాడు. ఆ తర్వాత ఇంటికి వెళ్లిన బాధితురాలు తన తండ్రికి జరిగిన విషయాన్ని వివరించింది. దీంతో తండ్రి ఇచ్చిన ఫిర్యాదుతో మైలాడుతురై జిల్లా చైల్డ్ ప్రొటెక్షన్ ఆఫీస్ వర్కర్ ఆరోగ్యరాజ్, మరో ఉద్యోగితో కలిసి బాధితురాలి ఇంటికి వెళ్లి విచారించగా బాలిక జరిగిన విషయాన్ని అధికారుల దృష్టికి తీసుకెళ్లింది. ఆ తర్వాత పెరంబూర్ పీఎస్‌లో ఆరోగ్యరాజ్ ఫిర్యాదు చేశారు. నిందితుడు తిరునావుక్కరసుపై పోక్సో చట్టం కింద కేసు నమోదు చేసి అరెస్ట్ చేశారు. నిందితుడికి కఠన శిక్ష విధించేలా కృషి చేయాలని బాధితురాలి తండ్రి కోరుకుంటున్నాడు.