పండక్కి ఊరెళ్లాలని, బంధుమిత్రులతో సంబరాలు జరుపుకోవాలన్న కోరిక అందరికీ ఉంటుంది. సంక్రాంతి పండుగకు అయితే సొంతూరుకు వెళ్లాలని చాలా మంది అనుకుంటారు. నాలుగైదు రోజుల ముందే ఊరుకు బయలుదేరుతారు. అయితే ఊరికి వెళ్లేటప్పుడు అప్రమత్తంగా ఉండాలని అంటున్నారు పోలీసులు. కొన్ని సూచనలు చేస్తున్నారు. వాటిని పాటించాలని చెబుతున్నారు. సొంతూరుకు వెళ్లే ముందు ఫోటోలు(Photos), వీడియోలు(Videos) సోషల్‌ మీడియాలో(Social media) అప్‌లోడ్‌ చేయకపోవడం మంచిదని పోలీసులు అంటున్నారు.

పండక్కి ఊరెళ్లాలని, బంధుమిత్రులతో సంబరాలు జరుపుకోవాలన్న కోరిక అందరికీ ఉంటుంది. సంక్రాంతి పండుగకు అయితే సొంతూరుకు వెళ్లాలని చాలా మంది అనుకుంటారు. నాలుగైదు రోజుల ముందే ఊరుకు బయలుదేరుతారు. అయితే ఊరికి వెళ్లేటప్పుడు అప్రమత్తంగా ఉండాలని అంటున్నారు పోలీసులు. కొన్ని సూచనలు చేస్తున్నారు. వాటిని పాటించాలని చెబుతున్నారు. సొంతూరుకు వెళ్లే ముందు ఫోటోలు(Photos), వీడియోలు(Videos) సోషల్‌ మీడియాలో(Social media) అప్‌లోడ్‌ చేయకపోవడం మంచిదని పోలీసులు అంటున్నారు. డోర్‌మాట్ కిందనో, చెప్పుల స్టాండ్స్‌లోనూ(Shoe Stand) తాళం చెవులు వదిలివెళ్లే అలవాటు కొందరికి ఉంటుందని, అలా చేయకూడదని పోలీసులు చెబుతున్నారు. మీకు తెలియకుండానే మీరు ఇచ్చే సమాచారంతో మీ ఇంట్లో దొంగలు పడుగ చేసుకునే అవకాశం ఉంటుందని హెచ్చరిస్తున్నారు. పండగకు మీరు సంతోషంగా ఊళ్లకు వెళ్లండి.. అవసరమైతే మీ ఇంటికి మేము గస్తీ కాస్తామని భరోసా ఇస్తున్నారు.

పోలీసులు ఏం చెబుతున్నారంటే...! మెయిన్‌ డోర్‌కు తాళం వేస్తే, అది కనిపించకుండా కర్టెన్స్‌తో కవర్‌ చేయాలి. బయటకు వెళ్లేటప్పుడు ఇంటిలోపల, బయట లైట్లు వేస్తే మంచిది. ఇంటిదగ్గర నమ్మకమైన ఇరుగు పొరుగువాళ్లకు ఇంటిని గమనించమని చెప్పాలి. ఇంటికి వచ్చి వెళ్లే దారులలో, ఇంటి లోపల సీసీ కెమెరాలను అమర్చుకొని డీవీఆర్‌ కనబడకుండా ఇంటిలోపల రహస్య ప్రదేశంలో పెట్టుకోవాలి. అల్మారా, కప్‌బోర్డ్స్‌కు సంబంధించిన తాళం చెవులను చెప్పుల స్టాండ్‌, పరుపులు, దిండ్ల కింద, అల్మారాపైన, డ్రెస్సింగ్‌ టేబుల్‌, కప్‌బోర్డ్స్‌లో పెట్టకుండా మీ ఇంట్లోనే రహస్య ప్రదేశంలో దాచాలి. బంగారు ఆభరణాలు వేసుకుని వేడుకలకు, గుళ్లకు వెళ్లేటప్పుడు జాగ్రత్తలు తీసుకోఆలి.

బయటకు వెళుతున్న విషయాన్ని ఎట్టి పరిస్థితుల్లోనూ సోషల్ మీడియాలో షేర్‌ చేయకూడదు. ఎవరిపైనైనా అనుమానం వస్తే వెంటనే డయల్‌ 100కు కాల్‌ చేయాలి. ఊరికి వెళ్లాల్సి వస్తే విలువైన బంగారు, వెండి, ఆభరణాలు, డబ్బులు, బ్యాంక్‌ లాకర్లలో భద్రపర్చుకోండి. లేదంటే మీ ఇంట్లోనే రహస్య ప్రదేశంలో దాచుకోండి. సెలవుల్లో బయటికి వెళుతున్నప్పుడు సెక్యూరిటీ అలారం, మోషన్‌ సెన్సర్‌ను ఏర్పాటు చేసుకోండి. మీ ఇంటికి సెంట్రల్‌ లాక్‌ సిస్టమ్‌ ఉండే తాళం అమర్చుకోవడం మరీ మంచిది. తాళం వేసి ఊరికి వెళ్లాల్సి వస్తే తప్పనిసరి స్థానిక పోలీస్‌స్టేషన్‌లో సమాచారం ఇవ్వండి. మీ కాలనీలో ఎవరైనా అనుమానాస్పద వ్యక్తులు కనిపిస్తే స్థానిక పోలీసు స్టేషన్‌కు సమాచారం ఇవ్వండి. తప్పనిసరిగా డయల్‌ 100కు కాల్‌ చేయండి. మీ వాహనాలను ఇంటి ఆవరణలోనే పారు చేసుకోండి. ద్విచక్ర వాహనాలకు తప్పనిసరిగా చైన్స్‌తో లాక్‌ వెయ్యడం మంచిది. నమ్మకమైన వ్యక్తులను మాత్రమే వాచ్‌మెన్‌/ సెక్యూరిటీ గార్డ్‌/సర్వెంట్‌గా నియమించుకోవాలి. మీ ఇంట్లో అమర్చిన సీసీ కెమెరాలను ఆన్‌లైన్‌లో ఎప్పటికప్పుడు చూసుకొంటూ ఉండాలి. ఇంట్లో లేనప్పుడు ఇంటి ముందు చెత్త చెదారం, న్యూస్‌ పేపర్స్‌, పాలప్యాకెట్లు జమ కానివ్వ

Updated On 10 Jan 2024 6:57 AM GMT
Ehatv

Ehatv

Next Story