తమిళనాడు(Tamilnadu) తంజావూర్(Tanjavur) జిల్లా కుంభకోణం సమీప సోలపురంలో(Solapuram) నాటు వైద్యుడు కేశవమూర్తి(Keshavamurthi) దారుణాలు ఒక్కొక్కటిగా వెలుగులోకి వస్తున్నాయి. హోమో సెక్స్(Homosex) వ్యవహారంలో మణల్‌మేడు మహారాజపురానికి చెందిన డ్రైవర్ అశోక్‌రాజును హత్య చేసి ఇంట్లోనే పూడ్చి పెట్టాడు కేశవమూర్తి. ఈ కేసులో అతడిని పోలీసులు అరెస్ట్ చేసి రిమాండ్‌కు తరలించారు.

Tanjavur thanjavur Skeleton Case
తమిళనాడు(Tamilnadu) తంజావూర్(Tanjavur) జిల్లా కుంభకోణం సమీప సోలపురంలో(Solapuram) నాటు వైద్యుడు(Siddha Practitioner) కేశవమూర్తి(Keshavamurthi) దారుణాలు ఒక్కొక్కటిగా వెలుగులోకి వస్తున్నాయి. హోమో సెక్స్(Homosex) వ్యవహారంలో మణల్‌మేడు మహారాజపురానికి చెందిన డ్రైవర్ అశోక్‌రాజును హత్య చేసి ఇంట్లోనే పూడ్చి పెట్టాడు కేశవమూర్తి. ఈ కేసులో అతడిని పోలీసులు అరెస్ట్ చేసి రిమాండ్‌కు తరలించారు. ఈ నెల 19వ తేదీన అశోక్‌రాజు(Ashokraj) మృతదేహాన్ని(Dead body) వెలికితీసే సమయంలో పక్కనే అనేక పుర్రెలు(skeletons) ఉండటం చూసి పోలీసులు దిగ్భ్రాంతి చెందారు. వాటిని కూడా పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. 2021లో అదృశ్యమైన కేశవమూర్తి ఫ్రెండ్ మహ్మద్ అనాస్ కపాలం కూడా ఇందులో ఉందని పోలీసులు అంటున్నారు. పుర్రెలను ఫోరెన్సిక్ లాబ్‌కు(Forensic Lab) పంపించారు. వారిచ్చే నివేదిక ఆధారంగా మృతుల వివరాలు తెలుస్తాయి. ఇప్పటికే కేశవమూర్తి డైరీని స్వాధీనం చేసుకున్న పోలీసులు అతడి ఇంట్లో తనిఖీలు చేపట్టారు. ప్రొక్లెయిన్‌తో ఇంటి ఆవరణలో తవ్వకాలు చేపట్టారు. ఈ తవ్వకాలలో మరికొన్ని పుర్రెలు బయటపడ్డాయి.
