ఉత్తరప్రదేశ్‌లోని(Uttar Pradesh) బుద్వాన్‌లో(budwan) ఓ ఉన్మాదిని పోలీసులు ఎన్‌కౌంటర్(Police encounter) చేశారు. ఆ వ్యక్తి ఇద్దరు పిల్లలను నరికి చంపాడు. మరో పిల్లాడిని తీవ్రంగా గాయపరిచాడు. అయితే కొన్ని గంటల్లోనే పోలీసుల ఎన్‌కౌంటర్‌లో అతడు చనిపోయాడు.

Uttar Pradesh
ఉత్తరప్రదేశ్‌లోని(Uttar Pradesh) బుద్వాన్‌లో(Badaun) ఓ ఉన్మాదిని పోలీసులు ఎన్‌కౌంటర్(Police encounter) చేశారు. ఆ వ్యక్తి ఇద్దరు పిల్లలను నరికి చంపాడు. మరో పిల్లాడిని తీవ్రంగా గాయపరిచాడు. అయితే కొన్ని గంటల్లోనే పోలీసుల ఎన్‌కౌంటర్‌లో అతడు చనిపోయాడు. ఇటీవలే అతడు బాబా కాలనీలో బార్బర్ షాపు పెట్టుకున్నాడు. ఏమైందో ఏమో తెలియదు కానీ సడన్‌గా ఓ ఇంట్లో చొరబడి ముగ్గురు అన్నదమ్ములపై దాడికి దిగాడు. ఆ దాడిలో ఆయుష్, అహాన్ అనే ఇద్దరు పిల్లలు చనిపోయారు.యువరాజ్ అనే పిల్లోడు తీవ్ర గాయాలతో ఆసుపత్రిలో చికిత్స తీసుకుంటున్నారు. మండీ పోలీస్ పోస్ట్ సమీపంలో ఈ ఘటన చోటు చేసుకుంది. నిందితుడు 22 ఏళ్ల సాజిద్‌గా పోలీసులు గుర్తించారు. పిల్లలను చంపిన తర్వాత అతడు రక్తపు దుస్తుల్లోనే అక్కడ్నుంచి వెళ్లిపోయాడు. పోలీసులు అతడి ఆచూకి కోసం గాలిస్తున్న క్రమంలో షేక్‌పురా ఫారెస్ట్ దగ్గర అతడు కనిపించాడు. పిల్లల ఇంటికి వెళ్లి అమ్మమ్మను కలిసిన తర్వాత రెండో అంతస్తులో ఉన్న పిల్లల దగ్గరకు ఆ ఉన్మాది వెళ్లాడని బరేలీ రేంజ్ ఐజీ ఆర్కే సింగ్ తెలిపారు.
