ఇటీవల తమిళనాడులో(Tamilnadu) తెలుగువారిపై(Telugu people) అనుచిత వ్యాఖ్యలు చేసిన నటి కస్తూరిపై(Kastruri) తమిళనాడులో కేసు(Police case) నమోదైంది.
ఇటీవల తమిళనాడులో(Tamilnadu) తెలుగువారిపై(Telugu people) అనుచిత వ్యాఖ్యలు చేసిన నటి కస్తూరిపై(Kastruri) తమిళనాడులో కేసు(Police case) నమోదైంది. ఇండియా తెలుగు సమ్మేళనం తరఫున కస్తూరిపై చెన్నై పోలీస్ కమిషనర్ కార్యాలయంలో ఫిర్యాదు చేశారు. దీంతో పోలీసులు ఆమెపై 192, 196(1ఏ)3 53,353(2) సెక్షన్ల కింద కేసును నమోదు చేశారు. విచారణలో భాగంగా ఆమెను పోలీస్ కార్యాలయానికి రప్పించడానికి సమన్లు(Sumons) జారీ చేయడానికి ఏర్పాట్లు చేస్తున్నారు.
తమిళనాడులో ఉంటున్న తెలుగువారు రాజుల కాలంలో అంతఃపుర మహిళలకు సేవ చేసేందుకు వచ్చినవారని... అలాంటి వారంతా ఇప్పుడు తమది తమిళజాతి అంటూ పెద్ద పెద్ద డైలాగులు కొడుతున్నారన్నారు. 300 ఏళ్ల క్రితం ఒక రాజుల వద్ద ఉండే అంతఃపుర మహిళలకు సేవ చేయడానికి వచ్చారన్నారు. వారే తమది తమిళజాతి అంటే వందల ఏళ్ల క్రితం ఉన్న బ్రాహ్మణులను తమిళులు కాదని చెప్పేందుకు మీరెవరు అని ఆమె ప్రశ్నించారు. ప్రస్తుతం తమిళనాడు మంత్రుల్లో ఐదుగురు మంత్రులు తెలుగు మాట్లాడుతారు. ఆస్తులను కొల్లగొట్టకూడదని.. ఒకరి కంటే ఎక్కువ మంది భార్యలను చేసుకోవద్దని చెప్తున్న బ్రాహ్మణుల గురించి వ్యతిరేకంగా ప్రచారం చేస్తున్నారన్నారు