ప్రయాణ సమయాల్లో క్రీడాకారులు అత్యంత జాగ్రత్తగా వ్యహరించాలి. ముఖ్యంగా క్రికెటర్లు(Cricketers). చిన్నపాటి గాయమైనా కొన్నాళ్ల పాటు క్రికెట్‌కు దూరంగా ఉండాల్సి వస్తుంది. రిషబ్ పంత్‌కు(Rishab Panth) ఏమైందో మనం చూశాం కదా! కెరీర్ పీక్‌లో ఉన్న సమయంలోనే రోడ్డు యాక్సిడెంట్‌లో తీవ్రంగా గాయపడ్డారు. ఇప్పుడిప్పుడే కోలుకుంటున్నారు.
ప్రయాణ సమయాల్లో క్రీడాకారులు అత్యంత జాగ్రత్తగా వ్యహరించాలి. ముఖ్యంగా క్రికెటర్లు(Cricketers). చిన్నపాటి గాయమైనా కొన్నాళ్ల పాటు క్రికెట్‌కు దూరంగా ఉండాల్సి వస్తుంది. రిషబ్ పంత్‌కు(Rishab Panth) ఏమైందో మనం చూశాం కదా! కెరీర్ పీక్‌లో ఉన్న సమయంలోనే రోడ్డు యాక్సిడెంట్‌లో తీవ్రంగా గాయపడ్డారు. ఇప్పుడిప్పుడే కోలుకుంటున్నారు. ఈ విషయం ఎందుకు చెప్పాల్సి వస్తున్నదంటే టీమిండియా కెప్టెన్ రోహిత్‌శర్మ(Rohith Sharma) కారును అత్యంత వేగంతో(Highspeed) నడిపి వివాదంలో చిక్కుకున్నాడు.ముంబాయి-పుణె మార్గంలో రోహిత్ శర్మ కారు 200 కిలోమీటర్లకు పైగా వేగంతో ప్రయాణించచడంతో పోలీసులు అతడికి ఫైన్ విధించారు. ఓ దశలో రోహిత్ శర్మ కారు అత్యధికంగా 215 కిలోమీటర్ల వేగాన్ని అందుకున్నదట!వేర్వేరు ప్రదేశాల్లో పరిమితికి మించిన వేగంతో కారు వెళ్లినందుకు యజమాని అయిన రోహిత్‌కు చలానాలు వేశారు.ఆ కారులో రోహిత్ శర్మ ప్రయాణిస్తున్నాడో లేదో తెలియదు కానీ ప్రయాణించి ఉంటే మాత్రం రిస్క్ తీసుకున్నట్టే అనుకోవాలి. ఏ మాత్రం తేడా జరిగినా ఇంటిపట్టున కూర్చోవాల్సి వస్తుంది.