కేరళలోని(Kerala) శబరి ఆలయానికి(Shabarimala Temple) భక్తులు పోటెత్తారు. లక్షల మంది స్వామివారు తమ ముడుపులు చెల్లించుకునేందుకు శబరిలోని అయ్యప్పస్వామి ఆలయానికి వస్తున్నారు. భక్తుల సంఖ్య భారీగా పెరగడంతో నిన్న రాత్రి నుంచి శబరిమల మార్గమధ్యలో అయ్యప్ప స్వాములను పోలీసులు(Police) నిలిపివేశారు. తాళ్లతో కట్టి భక్తులను గంటల తరబడి నిలబెట్టారు. చిన్న పిల్లలు ఉన్నారని, ఎన్ని గంటలు వెయిట్ చేయాలని పోలీసులను ప్రశ్నించారు.
కేరళలోని(Kerala) శబరి ఆలయానికి(Shabarimala Temple) భక్తులు పోటెత్తారు. లక్షల మంది స్వామివారు తమ ముడుపులు చెల్లించుకునేందుకు శబరిలోని అయ్యప్పస్వామి ఆలయానికి వస్తున్నారు. భక్తుల సంఖ్య భారీగా పెరగడంతో నిన్న రాత్రి నుంచి శబరిమల మార్గమధ్యలో అయ్యప్ప స్వాములను పోలీసులు(Police) నిలిపివేశారు. తాళ్లతో కట్టి భక్తులను గంటల తరబడి నిలబెట్టారు. చిన్న పిల్లలు ఉన్నారని, ఎన్ని గంటలు వెయిట్ చేయాలని పోలీసులను ప్రశ్నించారు. 18 కంపార్ట్‌మెంట్లలో భక్తులు వేచి ఉన్నారు. దర్శనానికి సుమారు 10 గంటలకుపైగా పడుతోంది. అయ్యప్పస్వాములకు కనీస వసతులు కల్పించలేదని ఆరోపిస్తున్నారు. కనీసం మంచి నీరు కూడా ఇవ్వడంలేదని అయ్యప్పస్వాములు ఆందోళన చేశారు. ట్రావెన్ కోర్ దేవస్థాన బోర్డుకు(Travancore Temple Board) వ్యతిరేకంగా నిరసన చేపట్టారు. దీంతో అయ్యప్ప స్వాములపై పోలీసులు లాఠీచార్జ్(Lati Charge) చేశారు. దీంతో కేరళ పోలీసులపై పెద్ద ఎత్తున విమర్శలు వస్తున్నాయి. అయ్యప్ప స్వాములకు కనీస సదుపాయాలు కల్పించకుండా.. వారిపైనే దాడి చేయడమేంటని భక్తులు ప్రశ్నిస్తున్నారు.