మోసగించడం కూడా ఓ కళే! అది అందరికీ అబ్బదు. ఒకరో ఇద్దరినో మోసం చేయడం పెద్ద కష్టమైన పని కాదు కానీ 20 మందిని మోసగించడానికి అడ్డమైన తెలివితేటలన్నీ కావాలి.

మోసగించడం కూడా ఓ కళే! అది అందరికీ అబ్బదు. ఒకరో ఇద్దరినో మోసం చేయడం పెద్ద కష్టమైన పని కాదు కానీ 20 మందిని మోసగించడానికి అడ్డమైన తెలివితేటలన్నీ కావాలి. మహారాష్ట్రకు(Maharashtra) చెందిన ఫిరోజ్‌ నియాజ్‌ షేక్‌(Firoz niyaz shaik) ఈ కోవకే వస్తాడు. 43 ఏళ్ల ఇతగాడిని పోలీసులు ఈ నెల 23వ తేదీన అరెస్ట్‌ చేశారు. కారణం తెలిస్తే ఆశ్చర్యపోతారు. నల్ల సోపారలోని ఓ మహిళను మాట్రిమోనియల్‌ వైబ్‌సైట్‌లో చూసిన ఫిరోజ్‌ నియాజ్‌ షేక్‌ ఆమెతో ఫ్రెండ్‌షిప్‌ చేశాడు. బాధలను తీరుస్తానని మాయమాటలు చెప్పాడు. తర్వాత పెళ్లి చేసుకున్నాడు. 2023లో ఆమె నుంచి ఖరీదైన ల్యాప్‌టాప్‌, ఇతర విలువైన వస్తువులు, నగదు తీసుకున్నాడు. అక్కడ్నుంచి ఉడాయించాడు. అతడి చేతిలో మోసపోయిన ఈమె పోలీసులకు కంప్లయింట్‌ చేసింది. పోలీసులు నిందితుడిని విచారించగా అసలు విషయం వెలుగులోకి వచ్చింది. దేశంలోని వివిధ ప్రాంతాలకు చెందిన 20 మందిని మోసగించి, పెళ్లి చేసుకున్నాడని తేలింది. ఇతడు కేవలం మహారాష్ట్రకే పరిమితం కాలేదు., ఢిల్లీ, ఉత్తరప్రదేశ్‌, గుజరాత్ ఇలా పలు చోట్ల మహిళలను మోసం చేశాడు. 2023లో ఇద్దరు మహిళల నుంచి దాదాపు 23 లక్షలు తీసుకొని పరారయ్యాడని ఎఫ్ఐఆర్ నమోదు అయ్యింది. ఫిరోజ్‌ విడాకులు తీసుకున్న, వితంతు మహిళలను లక్ష్యంగా చేసుకునేవాడు. వారితో స్నేహం నటించి, పెళ్లి చేసుకుని , వారి దగ్గర ఉన్న విలువైన వస్తువులను దోచుకునేవాడు.

Eha Tv

Eha Tv

Next Story