ఓ వ్యక్తి తన గులేరుతో(Guleru) పిట్టకు(bIRD) గురిపెట్టాడు. అది గురితప్పింది.. అటుగా వెళ్తున్న వందేభారత్ రైలు(Vandhe bharath Train) అద్దాన్ని బద్దలు చేసింది. జనగామ సమీపంలో ఈ ఘటన చోటు చేసుకుంది. జనగామ(Janagama) అంబేద్కర్ నగర్‌కు(Ambedkarnagar) చెందిన హరిబాబు(Haribabu) (60) పిట్టలను కొట్టిచంపి వాటిని తింటుంటాడు.

Vande Bharat
ఓ వ్యక్తి తన గులేరుతో(Guleru) పిట్టకు(Bird) గురిపెట్టాడు. అది గురితప్పింది.. అటుగా వెళ్తున్న వందేభారత్ రైలు(Vandhe bharath Train) అద్దాన్ని బద్దలు చేసింది. జనగామ సమీపంలో ఈ ఘటన చోటు చేసుకుంది. జనగామ(Janagama) అంబేద్కర్ నగర్‌కు(Ambedkarnagar) చెందిన హరిబాబు(Haribabu) (60) పిట్టలను కొట్టిచంపి వాటిని తింటుంటాడు. ఈ క్రమంలో శనివారం తన గులేరుతో పిట్టను కొట్టాలనుకున్నాడు. అది గురితప్పి విశాఖ నుంచి హైదరాబాద్ వెళ్తునన వందేభారత్ రైలు అద్దాలను తగలడంతో అవి పగిలిపోయాయి. పోలీసులు ఆరా తీయగా..హరిబాబు పనేనని గుర్తించారు. దీంతో గులేరును సీజ్ చేసి హరిబాబుపై కేసు నమోదు చేశారు. ఈ ఘటనలో తన తప్పులేదని.. కావాలని తప్పు చేయలేదని పోలీసులకు హరిబాబు విజ్ఞప్తి చేశాడు
