పుణె పోర్షే కారు ప్రమాద ఘటన(Pune Car Accident) రోజుకో మలుపు తిరుగుతోంది. ఈ ఘటనలో నిందితుడు అయిన మైనర్ రక్త నమూనాల రిపోర్టులను డాక్టర్లు తారుమారు చేసిన విషయం వెలుగులోకి వచ్చింది. సానూన్ ఆసుపత్రిలోని డాక్టర్ అజయ్ తావ్రే, డాక్టర్ శ్రీహరిలను పుణె క్రైమ్ బ్రాంచ్ పోలీసులు(Crime Branch Police) అరెస్ట్ చేశారు. రోడ్డు ప్రమాద ఘటన రోజు ఆ మైనర్ బాలుడు తన ఫ్రెండ్స్‌తో కలిసి మద్యం తాగినట్టు సీసీటీవీ ఫుటేజ్‌లో స్పష్టంగా ఉటే, ప్రభుత్వ ఆసుపత్రిలో ఫోరెన్సిక్ హెడ్‌గా(Forensic) పని చేస్తున్న అజయ్ తావ్రే(Ajay Thavre) మాత్రం బాలుడి రక్త పరీక్షలో మద్యం సేవించినట్టు లేదని రిపోర్ట్ ఇచ్చారు.
పుణె పోర్షే కారు ప్రమాద ఘటన(Pune Car Accident) రోజుకో మలుపు తిరుగుతోంది. ఈ ఘటనలో నిందితుడు అయిన మైనర్ రక్త నమూనాల రిపోర్టులను డాక్టర్లు తారుమారు చేసిన విషయం వెలుగులోకి వచ్చింది. సానూన్ ఆసుపత్రిలోని డాక్టర్ అజయ్ తావ్రే, డాక్టర్ శ్రీహరిలను పుణె క్రైమ్ బ్రాంచ్ పోలీసులు(Crime Branch Police) అరెస్ట్ చేశారు. రోడ్డు ప్రమాద ఘటన రోజు ఆ మైనర్ బాలుడు తన ఫ్రెండ్స్‌తో కలిసి మద్యం తాగినట్టు సీసీటీవీ ఫుటేజ్‌లో స్పష్టంగా ఉటే, ప్రభుత్వ ఆసుపత్రిలో ఫోరెన్సిక్ హెడ్‌గా(Forensic) పని చేస్తున్న అజయ్ తావ్రే(Ajay Thawre) మాత్రం బాలుడి రక్త పరీక్షలో మద్యం సేవించినట్టు లేదని రిపోర్ట్ ఇచ్చారు. రిపోర్టు నెగటివ్ రావడంతో రక్త నమూనాలను తారుమారు చేసినట్టు రుజువవ్వడంతో పోలీసులు ఆ ఇద్దరు డాక్టర్లను అరెస్ట్ చేశారు. ఇది మద్యం మత్తులో కారు నడపటం వల్ల జరిగిన ప్రమాదం కాదని, మైనర్ బాలుడికి తన ప్రవర్తనపై పూర్తి అవగాహన ఉందని పుణె పోలీసు కమిషనర్ అమితోష్ కుమార్(Amitosh Kumar) అన్నారు. నిందితుడైన మైనర్, అతడి స్నేహితులు కలిసి రెండు బార్లలో పార్టీ చేసుకున్నారని, తర్వాత ఇరుకైన వీధిలో నంబర్‌ప్లేట్ లేని కారుతో ర్యాష్ డ్రైవింగ్ చేశారని, అందుకే తాము దీనిపై దృష్టి పెట్టామని అమితోష్ అన్నారు. అతడు పూర్తి అవగాహనతో ఉన్నాడని, తన చర్యల వల్ల ఎదుటివారి ప్రాణాలు పోతాయని తెలుసని అమితోష్ చెప్పుకొచ్చారు. ప్రమాదం జరిగిన తర్వాత రెండు వేర్వేరు సమయాల్లో బ్లడ్‌ను పరీక్ష చేయించామని, రెండు ఒకేలా కచ్చితంగా ఉన్నాయని కుమార్ తెలిపారు. మొదటి రక్త నమూనాలో మద్యం తాగినట్లు రాలేదని, రెండో నమూనాలో మద్యం సేవించినట్లు పాజిటివ్ రావటం గమనార్హమని పోలీసులు చెబుతున్నారు. ప్రమాదం జరిగిన సమయంలో తానే కారు నడిపినట్లుగా డ్రైవర్ అంగీకరించేందుకు డ్రైవర్ కుటుంబానికి నిందితుడి తాత పెద్ద మొత్తంలో డబ్బు ఇవ్వడానికి ప్రయత్నించాడని పోలీసులు కోర్టుకు చెప్పారు. తాము చెప్పినట్టు నడుచుకోవాలని తాత డ్రైవర్‌ను బెదిరించాడట! ఇదే సమయంలో బాలుడి తాతపై ఉన్న ఇతర కేసుల వివరాలు కూడా పోలీసులు కోర్డుకు వివరించారు. ఇరు వర్గాల వాదనలు విన్న కోర్టు బాలుడి తాతకి ఈనెల 28 వరకు రిమాండు విధించింది.