అయోధ్యలో రామమందిరం(Ayodhya Ram temple) కోసం ఎదురుచూసిన వారు చాలా మందే ఉన్నారు. పోకల దమ్మక్క అనే గిరిజన మహిళ భద్రాచలం పుణ్యక్షేత్రం కోసం ఎన్నిపాట్లు పడ్డారో మనకు తెలిసిందే! రాముడి దర్శనం కోసం కళ్లు కాయలు కాసేలా ఎదురుచూసిన శబరి రాముడికి ఎంగిలి పండ్లు తినిపించి మహా భక్తురాలయ్యింది. అలాగే జార్ఖండ్‌కు చెందిన సరస్వతీదేవి కూడా!

అయోధ్యలో రామమందిరం(Ayodhya Ram temple) కోసం ఎదురుచూసిన వారు చాలా మందే ఉన్నారు. పోకల దమ్మక్క అనే గిరిజన మహిళ భద్రాచలం పుణ్యక్షేత్రం కోసం ఎన్నిపాట్లు పడ్డారో మనకు తెలిసిందే! రాముడి దర్శనం కోసం కళ్లు కాయలు కాసేలా ఎదురుచూసిన శబరి రాముడికి ఎంగిలి పండ్లు తినిపించి మహా భక్తురాలయ్యింది. అలాగే జార్ఖండ్‌కు చెందిన సరస్వతీదేవి కూడా! ఆమె రామాలయం కల ఇన్నాళ్లకు సాకారమయ్యింది. ఆమె జనవరి 22వ తేదన అయోధ్యకు చేరుకుని తన మూడు దశాబ్దాల మౌనవ్రతాన్ని విరమించనుంది. జార్ఖండ్‌లోని ధన్‌బాద్‌ పరిధిలోని కరమ్‌తాండ్‌లో ఉంటారు 85 ఏళ్ల సరస్వతి అగర్వాల్‌. 30 ఏళ్ల కిందట రాముడి గుడి కోసం మౌనవ్రతం చేపట్ఇంది. అయోధ్యలో రాముడి గుడి కట్టేంత వరకు తాను ఎవరితోనూ మాట్లాడనని శపథం చేసింది. జనవరి 22వ తేదీన అయోధ్యలోని శ్రీరామమందిర ప్రారంభోత్సవం రోజున రామ్, సీతారాం అంటూ ఆమె మౌన దీక్ష విరమించనుంది. రాముడిపై ఆమెకు అపారమైన భక్తి. రాముడి కోసమే జీవితాన్ని అంకితం చేసింది. అందుకే ఇక నుంచి ఆమె అయోధ్యలోనే ఉండిపోవాలని అనుకుంటోంది. ఆలయం నిర్మితమవ్వడంతో ఆమె సంతోషంతో ఉప్పొంగిపోతున్నారు. ‘ఇంతకాలానికి నా జీవితం ధన్యమైంది. ప్రాణ ప్రతిష్టలో పాల్గొనేందుకు బాల రాముడు నన్ను ఆహ్వానించాడు. నా ఇన్నాళ్ల తపస్సు సఫలమయ్యింది. 30 ఏళ్ల తర్వాత నేను మౌనాన్ని వీడనున్నాను. మహంత్ నృత్య గోపాల్ దాస్ ఆశ్రమానికి వెళ్లి అక్కడే ఉండాలనుకుంటున్నాను’ అని సరస్వతీదేవి చెప్పింది. సరస్వతి అగర్వాల్‌కు అయోధ్యలో జరిగే శ్రీరామ ప్రాణ ప్రతిష్ఠ కార్యక్రమంలో పాల్గొనేందుకు ఆహ్వానం అందింది. దీంతో సరస్వతీ దేవి సోదరులు ఆమెను ఇప్పటికే అయోధ్యకు తీసుకువచ్చారు. శ్రీ రామ జన్మభూమి తీర్థ క్షేత్ర అధిపతి మహంత్ నృత్య గోపాల్ దాస్ శిష్యులు మనీష్ దాస్, శశి దాస్ సరస్వతి తదితరులు ఆమెను అయోధ్య ధామ్ రైల్వే స్టేషన్‌లో స్వాగతించారు. ఆమె నాలుగు నెలల పాటు స్వామీజీ ఆశ్రమంలో ఉండనున్నారు. 1992 మేలో సరస్వతి అగర్వాల్‌ అయోధ్యకు వెళ్లింది. అక్కడ రామజన్మభూమి ట్రస్ట్ అధినేత మహంత్‌ నృత్యగోపాల్‌ దాస్‌ను కలిసింది. ఆయన ఆశీర్వాదంతో సరస్వతిదేవి కమ్తానాథ్‌ పర్వత ప్రదక్షిణ చేసింది. తర్వాత చిత్రకూట్‌లో ఏడున్నర నెలల పాటు కల్పవాసంలో ఉండిపోయారు. రోజూ 14 కిలోమీటర్ల కమ్తానాథ్ పర్వత ప్రదక్షిణ చేసేది. 1992, డిసెంబర్ 6వ తేదీన ఆమె తిరిగి నృత్య గోపాల్ దాస్‌ను కలిసింది. ఆయన ఆదేశాలతో మౌనవ్రతాన్ని చేపట్టింది. రామాలయ నిర్మాణం పూర్తయ్యాక మౌన వ్రతం వీడాలని ఆమె నిశ్చయించుకున్నారు. సరస్వతీదేవి చదువుకోలేదు. ఆమె భక్త సహకారంతో అక్షరాలు దిద్దింది. ఇప్పుడామె రామ చరిత మానసతో పాటు ఇతర గ్రంథాలను రోజూ చదువుతుంది. రోజుకు ఒకసారి సాత్విక ఆహారం తీసుకుంటుంది. 35 ఏళ్ల క్రితం ఆమె భర్త చనిపోయాడు. వారికి ఎనిమిదిమంది సంతానం. మౌన దీక్ష చేపట్టినప్పుడు వారంతా అమ్మకు సహకరించారు.

Updated On 9 Jan 2024 7:10 AM GMT
Ehatv

Ehatv

Next Story