ఇమ్రోజ్‌గా(Imroz) సుప్రసిద్ధుడైన ప్రముఖ కవి(Poet), కళాకారుడు ఇందర్‌జీత్(Inderjeet) శుక్రవారం ముంబాయిలో కన్నుమూశారు. 97 ఏళ్ల ఇమ్రోజ్ వయోసంబంధ వ్యాధులతో బాధపడుతున్నారు. ఆసుపత్రిలో చికిత్స పొందుతూ ఆయన మరణించారు.
ఇమ్రోజ్‌గా(Imroz) సుప్రసిద్ధుడైన ప్రముఖ కవి(Poet), కళాకారుడు ఇందర్‌జీత్(Inderjeet) శుక్రవారం ముంబాయిలో కన్నుమూశారు. 97 ఏళ్ల ఇమ్రోజ్ వయోసంబంధ వ్యాధులతో బాధపడుతున్నారు. ఆసుపత్రిలో చికిత్స పొందుతూ ఆయన మరణించారు. రచయిత్రి అమృతా ప్రీతమ్(Amrita Pritam), ఇమ్రోజ్ మధ్య 40 ఏళ్లకు పైగా బంధం ఉంది. ముంబాయిలోని కాండివిలిలో ఇమ్రోజ్ అంత్యక్రియలు పూర్తి చేసినట్టు అమృతా ప్రీతమ్ కోడలు అల్కా క్వాట్రా తెలిపారు. ఇమ్రోజ్ చితికి అమృతా ప్రీతమ్ మనవరాలు నిప్పు అంటించారు. 1952లో పంజాబ్‌లోని ల్యాల్‌పూర్‌లో ఇందర్‌జీత్ జన్మించారు. అమృతా ప్రీతమ్‌తో ఆయనకు 1950ల నుంచి అనుబంధం ఉంది. నలభై ఏళ్ల పాటు కలిసే ఉన్నారు. 2005లో అమృతా ప్రీతమ్ కన్నుమూశారు. ప్రీతమ్ అనారోగ్యం బారిన పడినప్పటి నుంచి ఇమ్రోజ్ కవితలు రాయడం మొదలుపెట్టారు. అమృత చనిపోయిన తర్వాతకూడా కవితా వ్యాసంగాన్ని ఆయన కొనసాగించారు. తన సాహిత్యాన్ని అమృతకు అంకితం చేశారు.