ప్రధానమంత్రి నరేంద్ర మోదీ(Narendra Modi) మంగళ, బుధవారాల్లో కేరళ, తమిళనాడు, మహారాష్ట్ర రాష్ట్రాల్లో పర్యటించనున్నారు. ఈ సందర్భంగా ఆయా రాష్ట్రాల్లో 24,000 కోట్ల రూపాయల విలువైన వివిధ పథకాలకు ఆయన ప్రారంభోత్సవం, శంకుస్థాపన చేస్తారు. ప్రధానమంత్రి 16వ విడత కిసాన్ సమ్మాన్ నిధిని(Kisan Samman Fund) కూడా విడుదల చేస్తారు. 21,000 కోట్ల రూపాయలను రైతుల ఖాతాలకు బదిలీ చేస్తారు.
ప్రధానమంత్రి నరేంద్ర మోదీ(Narendra Modi) మంగళ, బుధవారాల్లో కేరళ, తమిళనాడు, మహారాష్ట్ర రాష్ట్రాల్లో పర్యటించనున్నారు. ఈ సందర్భంగా ఆయా రాష్ట్రాల్లో 24,000 కోట్ల రూపాయల విలువైన వివిధ పథకాలకు ఆయన ప్రారంభోత్సవం, శంకుస్థాపన చేస్తారు. ప్రధానమంత్రి 16వ విడత కిసాన్ సమ్మాన్ నిధిని(Kisan Samman Fund) కూడా విడుదల చేస్తారు. 21,000 కోట్ల రూపాయలను రైతుల ఖాతాలకు బదిలీ చేస్తారు.ఈ నేపథ్యంలో మొదట కేరళ లోని తిరువనంతపురం లోని విక్రమ్ సారాభాయ్ అంతరిక్ష కేంద్రాన్ని(Vikram Sarabhai Space Centre) ఈ రోజు ఉదయం 10.45 గంటలకు ప్రధాని మోదీ సందర్శించనున్నారు. దాదాపు 1,800 కోట్ల రూపాయల విలువైన మూడు కీలకమైన అంతరిక్ష మౌలిక సదుపాయాల ప్రాజెక్టులు ప్రధాని మోదీ ప్రారంభించనున్నారు. దేశ అంతరిక్ష రంగం సామర్థ్యాన్ని పెంపొందించడంతో పాటు సాంకేతిక, పరిశోధన, అభివృద్ధికి ఈ ప్రాజెక్టులు ప్రోత్సాహకరంగా ఉంటాయి. తర్వాత తమిళనాడు లోని మధురైలో(Madhurai) MSME పారిశ్రామిక వేత్తల కోసం ఫ్యూచర్ ఆటోమోటివ్ డిజిటల్ మొబిలిటీ ప్రోగ్రామ్(Automotive Digital Mobility Program) కార్యక్రమంలో ప్రధాని మోదీ పాల్గొంటారు. అటు పిమ్మట మహారాష్ట్ర లోని 5.5 లక్షల మహిళా స్వయం సహాయక బృందాలకు (SHG) 825 కోట్ల రూపాయలను ప్రధాని రివాల్వింగ్ ఫండ్ పంపిణీ చేస్తారు. దీంతో పాటు, మహారాష్ట్రలో కోటి ఆయుష్మాన్ కార్డులను పంపిణీ చేయనున్నారు. OBC కేటగిరీ లబ్ధిదారుల కోసం ప్రధాని మోదీ ఆవాస్ యోజనను ప్రారంభిస్తారు. అంతేకాదు, 1300 కోట్ల రూపాయల కంటే ఎక్కువ విలువైన అనేక రైల్వే ప్రాజెక్టులను కూడా ప్రధానమంత్రి ప్రారంభిస్తారు.