శ్రీరాముడు ఒక్క బీజేపీకి(BJP) మాత్రమే దేవుడు కాడు. నరేంద్రమోదీ(Narendra Modi) ఒక్కరే భక్తుడు కాడు. సమస్త హిందువులకు రాముడు ఆదర్శమూర్తి! ప్రతి ఒక్క హిందువు ఆ జగదభిరాముడి భక్తులే! ఆ మాటకొస్తే అన్యమతస్తులు కూడా రాముడిని కొలుస్తారు. పూజిస్తారు. అయోధ్య రామాలయ ప్రారంభోత్సవంపై బీజేపీ చేస్తున్న హంగామా, జాతీయ న్యూస్‌ ఛానెళ్లు(National News Channel) చేస్తున్న హడావుడి, కనబరుస్తున్న స్వామిభక్తి చూస్తుంటే వెగటు కలుగుతోంది. రాబోయే ఎన్నికల్లో(Elections) లబ్ధి పొందడానికి భారతీయ జనతా పార్టీ పనిగట్టుకుని ఈ పనిచేస్తున్నదన్న విషయం తెలియనివారు ఉండరు. ఈ మాట అన్నవారిని దేశ ద్రోహులుగానూ, రాహ ద్రోహులుగాను చిత్రీకరిస్తోంది గోది మీడియా! మోదీ సేవలో తరించిపోతున్న ఆ మీడియాకు ఎంతసేపూ విపక్షాలను ఆడిపోసుకోవడంలోనే సరిపోతున్నది. అయోధ్య(Ayodhya) ప్రారంభోత్సవంపై ప్రతిపక్ష పార్టీలు విమర్శిస్తున్నాయి.

ఆ వేడుకలను రాజకీయ లబ్ధి కోసం వాడుకుంటున్నారు కాబట్టి తాము వెళ్లడం లేదని కాంగ్రెస్‌ పార్టీ(Congress Party) ప్రకటించింది. గోది మీడియా మాత్రం దాన్ని మరో రకంగా ప్రొజెక్ట్‌ చేస్తున్నది. కాంగ్రెస్‌ను రామ్‌ద్రోహిగా ప్రకటిస్తున్నది. అదే సమయంలో శంకరాచార్య పీఠాధిపతులు కూడా ఆగ్రహం వ్యక్తం చేశారు. ప్రాణప్రతిష్ట వేడుకను బహిష్కరించారు. ఈ విషయాన్ని ఏ ఒక్క ఛానెల్‌ కూడా చెప్పలేదు. చెప్పదు కూడా! శంకరాచార్య పీఠాధిపతులపై కూడా బీజేపీ ఇప్పుడు విమర్శలు చేయడం మొదలు పెట్టింది. అయినా శంకరాచార్యులు లేవనెత్తిన ప్రశ్నలకు జవాబులు చెప్పాలి కానీ, వారిపై కత్తులు దూయడమేమిటన్నది సామాన్యులకొస్తున్న సందేహం! వారు ఏమన్నారు? రాముడి విగ్రహ ప్రాణప్రతిష్ట మహోత్సవాన్ని బీజేపీ ఒక రాజకీయ ప్రచారంగా మార్చిందని ధ్వజమెత్తారు. ఇది నిజమే కదా! వారన్నదాంట్లో ఏమైనా తప్పుందా? సనాతన ధర్మం, శాస్త్ర విధులు, ఆచారాలకు అనుగుణంగా విగ్రహ ప్రతిష్ట కార్యక్రమం జరగడం లేదని చెప్పారు.

ఇది కూడా నిజమే కదా! పొద్దున్న లేచినకాడి నుంచి సనాతన ధర్మమని బీజేపీ నేతలు చెబుతుంటారు కదా! మరి ఆ సనాతనధర్మానికే(Sanatanadharm) అవమానం జరుగుతున్నప్పుడు ఎందుకు సహిస్తున్నారన్నదే ప్రశ్న! జనవరి 22న జరిగే ప్రాణ ప్రతిష్ఠ వేడుకకు తాము హాజరుకావడం లేదని ఉత్తరాఖండ్‌లోని జ్యోతీష్‌మఠ్‌ పీఠాధిపతి శంకరాచార్య అవిముక్తేశ్వరానంద సరస్వతి, గుజరాత్‌లోని ద్వారకా పీఠాధిపతి శంకరాచార్య శ్రీ స్వామి సదానంద సరస్వతి, ఒడిశాలోని పూరీ పీఠాధిపతి శంకరాచార్య నిశ్చలానంద సరస్వతి స్పష్టం చేశారు. ప్రాణప్రతిష్ట కార్యక్రమానికి ఆహ్వానించారు కానీ తానువెళ్లడం లేదని, ఇది దైవ కార్యంగా లేదని, రాజకీయ ప్రచారంలా కనిపిస్తున్నదని పూరీ పీఠాధిపతి నిశ్చలానంద సరస్వతి అన్నారు. లోకసభ ఎన్నికల దృష్యా ఈ కార్యక్రమాన్ని అట్టహాసంగా నిర్వహిస్తున్నట్టు అర్థమవుతుందన్నారు.

తీర్థ స్థలాలు భోగస్థలాలుగా మారుతున్నాయని ఆవేదన చెందారు నిశ్చలానంద సరస్వతి. ఇక్కడ రాజకీయ నేతలు మఠాధిపతుల అవతారమెత్తుతున్నారని, అయోధ్య వేడుకల్లో శాస్ర్త విధి, ఆచారాలు నిర్లక్ష్యానికి గురవుతున్నాయి, రామాలయం నిర్మాణం పూర్తికాకుండానే పూజాదికాలు జరుగుతున్నాయని, పూర్తి కానీ ఆలయంలో ప్రాణ ప్రతిష్టచేయడానికి ఎలా ఆమోదిస్తామని జ్యోతిష్‌మఠ్‌ పీఠాధిపతి శంకరాచార్య స్వామి అవిముక్తేశ్వరానంద సరస్వతి ప్రశ్నిస్తున్నారు. పీఠాధిపతుల ఆక్షేపణలో సహేతుకత ఉంది. ఆలయం పూర్తిగా నిర్మాణం కాకుండా విగ్రహ ప్రతిష్ట చేయడం సనాతన సంప్రదాయానికి వ్యతిరేకం. భార్య పక్కన కూర్చోకుండా ఎవరూ సనాతన శుభ క్రతువులను జరపరాదు.

అలనాటి రామచంద్రుడు కూడా ఈ ప్రశ్న వేస్తే ఆమె రూప విగ్రహం పక్కన పెట్టుకుని జరపవచ్చని రుషులు చెప్పారు. అడవిపాలు చేసిన సీతమ్మ తల్లి బతికే ఉందో లేదో కూడా రాముడికి తెలియదు. పెద్దల మాటను మన్నించి బంగారుసీత బొమ్మ పక్కన పెట్టుకుని అశ్వమేథయాగం జరిపాడు. మరి భార్య లేని మోదీ ప్రతిష్టకు ఎలా అర్హడవుతారు? విగ్రహ ప్రతిష్ట రుత్వికులే వేదోక్తంగా జరపడమన్నది వైదిక ధర్మం కదా! హోమం ముందు కూర్చొని విగ్రహ ప్రతిష్ట చేయాలంటే ఆయన భార్యా సమేతుడై ఉండాలి. అలాకానప్పుడు అది రాముడి కాలం నుంచి కూడా సనాతన విరుద్ధమే. అయినా రామమందిర ప్రారంభోత్సవాన్ని ఇంత హడావుడిగా జరపడం ఎందుకు? చక్కగా శ్రీరామనవమి పండుగ రోజు జరపవచ్చు కదా! ఇవే కదా పీఠాధిపతులు వెలిబుచ్చిన సందేహాలు.. వీటికి సమాధానాలు చెప్పకుండా, వారిపై నిందలు వేయడం ఎలా సబబు? బీజేపీ ఎలా సమర్థించుకుంటుంది?

Updated On 12 Jan 2024 4:38 AM GMT
Ehatv

Ehatv

Next Story