దేశంలో ఎమర్జెన్సీ(Emergency) విధించి 48 ఏళ్లు పూర్తయ్యాయి. ఈ సందర్భంగా ఎమర్జెన్సీని వ్యతిరేకించిన వారికి ప్రధాని నివాళులర్పించారు. ఎమర్జెన్సీని ఎదిరించి, దేశంలో ప్రజాస్వామ్య స్ఫూర్తిని బలోపేతం చేసేందుకు కృషి చేసిన వారికి నివాళులు(Tributes) అర్పిస్తున్నట్లు ప్రధాని మోదీ(PM Narendra modi) ట్వీట్(Tweet) చేశారు.

దేశంలో ఎమర్జెన్సీ(Emergency) విధించి 48 ఏళ్లు పూర్తయ్యాయి. ఈ సందర్భంగా ఎమర్జెన్సీని వ్యతిరేకించిన వారికి ప్రధాని నివాళులర్పించారు. ఎమర్జెన్సీని ఎదిరించి, దేశంలో ప్రజాస్వామ్య స్ఫూర్తిని బలోపేతం చేసేందుకు కృషి చేసిన వారికి నివాళులు(Tributes) అర్పిస్తున్నట్లు ప్రధాని మోదీ(PM Narendra modi) ట్వీట్(Tweet) చేశారు. రాజ్యాంగ విలువలకు పూర్తిగా విరుద్ధమైన ఎమర్జెన్సీ మన దేశ చరిత్రలో మరపురాని సమయమ‌ని ప్రధాని మోదీ పేర్కొన్నారు. ఎమ‌ర్జెన్నీని ప్ర‌ధాని చీక‌టి రోజులుగా #DarkDaysOfEmergency గా అభివ‌ర్ణించారు. ప్ర‌ధాని ప్రస్తుతం ఈజిప్ట్(Egypt) పర్యటనలో ఉన్నారు.

బీజేపీ(BJP) అధ్యక్షుడు జేపీ నడ్డా(JP Nadda) కూడా ఎమర్జెన్సీని గుర్తు చేస్తూ ట్వీట్ చేశారు. 1975 జూన్ 25న ఒక కుటుంబం నియంతృత్వ వైఖరి కారణంగా.. దేశంలోని గొప్ప ప్రజాస్వామ్యాన్ని చంపి.. ఎమర్జెన్సీ వంటి కళంకాన్ని విధించిందని నడ్డా ట్వీట్‌లో రాశారు. వీరి నిర్దాక్షిణ్యం.. వందల ఏళ్ల పరాయి పాలనలోని దౌర్జన్యాన్ని మిగిల్చింది. అలాంటి క్లిష్ట సమయాల్లో.. అపారమైన చిత్రహింసలు భరించి ప్రజాస్వామ్య స్థాపన కోసం పోరాడిన దేశభక్తులందరికీ నమస్కరిస్తున్నాను అంటూ నడ్డా ట్వీట్ చేశారు.

Updated On 25 Jun 2023 1:41 AM GMT
Ehatv

Ehatv

Next Story