ఎన్ని గంటలైనా అలసిపోకుండా పని చేస్తూనే ఉంటారని ప్రధాని మోదీ గురించి చెబుతారు. 72 ఏళ్ల వయసులో కూడా చాలా ఫిట్‌గా ఉంటారు మోదీ. ఏప్రిల్ 24 నుంచి ప్రారంభమయ్యే తన పర్యటనతో మోదీ ప్ర‌స్తుతం వార్త‌ల్లో నిల‌వ‌డ‌మే కాక‌.. ఆదర్శంగా కూడా నిలువ‌నున్నారు. ప్ర‌ధాన‌మంత్రి ఈ పర్యటన సుదీర్ఘంగా, బిజీగా ఉంటుంది. ఏప్రిల్ 24 నుంచి 36 గంటల పాటు దేశంలోని వివిధ ప్రాంతాల్లో మోదీ పర్యటించనున్నారు.

ఎన్ని గంటలైనా అలసిపోకుండా పని చేస్తూనే ఉంటారని ప్రధాని మోదీ(Prime Minister Modi) గురించి చెబుతారు. 72 ఏళ్ల వయసులో కూడా చాలా ఫిట్‌గా ఉంటారు మోదీ. ఏప్రిల్ 24 నుంచి ప్రారంభమయ్యే తన పర్యటనతో మోదీ ప్ర‌స్తుతం వార్త‌ల్లో నిల‌వ‌డ‌మే కాక‌.. ఆదర్శంగా కూడా నిలువ‌నున్నారు. ప్ర‌ధాన‌మంత్రి ఈ పర్యటన సుదీర్ఘంగా, బిజీగా ఉంటుంది. ఏప్రిల్ 24 నుంచి 36 గంటల పాటు దేశంలోని వివిధ ప్రాంతాల్లో మోదీ పర్యటించనున్నారు. ఈ సమయంలో మోదీ 5 వేల కిలోమీటర్లకు పైగా ప్రయాణించనున్నారు. పర్యటనలో భాగంగా ప్ర‌ధాని ఏడు వేర్వేరు నగరాలను సందర్శించి, ఎనిమిది కార్యక్రమాలలో పాల్గొన‌నున్నారు.

దేశ రాజధాని ఢిల్లీ(Delhi) నుంచి మోదీ ప‌ర్య‌ట‌న‌ ప్రారంభం కానుంది. తొలుత ఆయన మధ్యప్రదేశ్‌(Madhya Pradesh)లో పర్యటించనున్నారు. అనంతరం దక్షిణాదిలోని కేరళ(Kerala)కు ప్రధాని వెళతారని అధికారులు తెలిపారు. ఆ తర్వాత పశ్చిమాన ఉన్న కేంద్ర పాలిత ప్రాంతానికి వెళ్లి.. తిరిగి ఢిల్లీకి చేరుకుంటారు.

ప్రధాని కార్యక్రమాల గురించి అధికారులు సమాచారం ఇచ్చారు. ఏప్రిల్ 24 ఉదయం ఢిల్లీ నుంచి ప్రధాని ఖజురహో(Khajuraho) వెళ్తారని చెప్పారు. ఈ సమయంలో ప్ర‌ధాని 500 కి.మీ కంటే ఎక్కువ దూరం ప్రయాణించనున్నారు. అనంత‌రం ఖజురహో నుండి రేవా(Rewa)కు వెళ్తారు. రేవాలో జాతీయ పంచాయతీరాజ్ దినోత్సవ కార్యక్రమంలో ఆయన పాల్గొంటారు. తరువాత సుమారు 280 కి.మీ ప్రయాణించి ఖజురహోకు తిరిగి వస్తారు. ఖజురహో నుంచి మోదీ కొచ్చి వెళ్లనున్నారు. యువం కాన్‌క్లేవ్‌లో పాల్గొనేందుకు ప్రధాని 1700 కి.మీ ప్రయాణించనున్నారు. ప్ర‌ధాని మరుసటి రోజు ఉదయం కొచ్చి(Kochi) నుండి తిరువనంతపురం(Tiruvananthapuram) వరకు దాదాపు 190 కి.మీ ప్రయాణించి తిరువనంతపురంలో వందే భారత్ ఎక్స్‌ప్రెస్‌(Vande Bharat Express)ను మోదీ జెండా ఊపి ప్రారంభించనున్నారు. ఇక్కడ ఆయన పలు ప్రాజెక్టుల ప్రారంభోత్సవాలు, శంకుస్థాపనలు కూడా చేస్తారు.

అనంత‌రం సూరత్(Surat) మీదుగా సిల్వస్సా(Silvassa)కు మోదీ వెళ్లనున్నారు. ఈ ప్రయాణం దాదాపు 1570 కి.మీ. మోదీ ఇక్కడి నమో మెడికల్ కాలేజీని సందర్శించి వివిధ ప్రాజెక్టులకు ప్రారంభోత్సవం, శంకుస్థాపన చేస్తారు. ఇది కాకుండా ప్రధాని డామన్‌(Daman)కు కూడా వెళ్లనున్నారు. డామన్‌లో దేవ్‌కా సీఫ్రంట్‌ను ప్రారంభిస్తారు. దీని తర్వాత దాదాపు 110 కిలోమీటర్ల దూరం ప్రయాణించి సూరత్ వెళ్తారు. సూరత్ నుంచి మోదీ తిరిగి ఢిల్లీకి వెళ్లనున్నారు. ఈ రెండు రోజుల్లో ప్రధాని దాదాపు 5300 కి.మీ మేర వైమానిక పర్యటన చేయనున్నారు.

Updated On 22 April 2023 7:02 AM GMT
Yagnik

Yagnik

Next Story