సెప్టెంబరు 23న వారణాసిలో పర్యటనకు వెళ్లనున్నారు ప్రధాని నరేంద్ర మోదీ. పర్యటనలో భాగంగా గంజరిలో రూ.450 కోట్లతో నిర్మిస్తున్న అంతర్జాతీయ క్రికెట్ స్టేడియంకు శంకుస్థాపన చేయనున్నారు. దీనితో పాటు వారణాసితో పాటు ఇతర జిల్లాల్లో

PM Narendra Modi to lay foundation stone for new state-of-the-art cricket stadium in Varanasi
సెప్టెంబరు 23న వారణాసి(Varanasi)లో పర్యటనకు వెళ్లనున్నారు ప్రధాని నరేంద్ర మోదీ(PM Modi). పర్యటనలో భాగంగా గంజరిలో రూ.450 కోట్లతో నిర్మిస్తున్న అంతర్జాతీయ క్రికెట్ స్టేడియం(International Cricket Stadium)కు శంకుస్థాపన చేయనున్నారు. దీనితో పాటు వారణాసితో పాటు ఇతర జిల్లాల్లో సిద్ధం చేసిన 14 అటల్ రెసిడెన్షియల్ పాఠశాల(Atal Residential Schools) లను ఆయన ప్రారంభిస్తారు. గంజరిలో వారణాసి క్రికెట్ స్టేడియం(Varanasi Cricket Stadium) శంకుస్థాపన అనంతరం జరిగే బహిరంగ సభలో ప్రధాని ప్రసంగిస్తారు. ఈ కార్యక్రమానికి మాజీ క్రికెటర్లు సచిన్ టెండూల్కర్(Sachin Tendulkar), సునీల్ గవాస్కర్(Sunil Gavaskar), కపిల్ దేవ్(Kapil Dev), గుండప్ప విశ్వనాథ్(Gundappa Vishwanath)తో సహా పలువురు ప్రముఖ క్రికెట్ స్టార్లు కూడా హాజరుకానున్నారు.
ప్రధాని మోదీ 23వ తేదీ మధ్యాహ్నం 12:30 గంటలకు వారణాసి విమానాశ్రయం నుంచి హెలికాప్టర్‌లో గంజరి చేరుకుంటారు. బీసీసీఐ అధ్యక్షుడు రోజర్ బిన్నీ(Roger Binni), వైస్ ప్రెసిడెంట్ రాజీవ్ శుక్లా(Rajeev Shukla), సెక్రటరీ జై షా(Jai Sha), ఉత్తరప్రదేశ్ క్రికెట్ అసోసియేషన్ ప్రెసిడెంట్ నిధిపతి సింఘానియా, డైరెక్టర్ యుధ్వీర్ సింగ్ సమక్షంలో రిమోట్ నొక్కడం ద్వారా వారణాసి క్రికెట్ స్టేడియంకు శంకుస్థాపన చేస్తారు. అనంతరం బహిరంగ సభలో ప్రసంగిస్తారు.
అనంతరం హెలికాప్టర్‌లో సంపూర్ణానంద సంస్కృత విశ్వవిద్యాలయానికి వెళ్లి.. ప్రధాని మోదీ రోడ్డు మార్గంలో సిగ్రాలోని రుద్రాక్ష్ కన్వెన్షన్ సెంటర్‌కు చేరుకుంటారు. అక్కడ రాష్ట్రంలోని 14 అటల్ రెసిడెన్షియల్ పాఠశాలలను ఆయన ప్రారంభిస్తారు. వారణాసిలోని కర్సాడాలోని అటల్ రెసిడెన్షియల్ స్కూల్‌లోని కొంతమంది పిల్లలతో కూడా వర్చువల్‌గా ఇంటరాక్ట్ అవుతారు.
