స్వామినాథన్‌కు భారతరత్న పురస్కారం ఇచ్చేసి గొప్పలు చెప్పుకుంటున్న నరేంద్రమోదీ(PM Narendra Modi) ప్రభుత్వం స్వామినాథన్ కమిషన్ చేసిన సిఫారసులను అమలు చేయమంటే మాత్రం కుదరని పని అంటోంది. అది అడిగిన రైతులపై(Farmers) కాల్పులు(Firing) జరుపుతోంది.
స్వామినాథన్‌కు భారతరత్న పురస్కారం ఇచ్చేసి గొప్పలు చెప్పుకుంటున్న నరేంద్రమోదీ(PM Narendra Modi) ప్రభుత్వం స్వామినాథన్ కమిషన్ చేసిన సిఫారసులను అమలు చేయమంటే మాత్రం కుదరని పని అంటోంది. అది అడిగిన రైతులపై(Farmers) కాల్పులు(Firing) జరుపుతోంది. పంటలకు మద్దతు ధరపై చట్టం(Support Price Law), స్వామినాథన్ కమిషన్(Swaminathan Commission) సిఫారసులను అమలు చేయాలన్న ప్రధాన డిమాండ్‌తో దేశ రాజధాని ఢిల్లీ(Delhi) వైపు దూసుకు వచ్చిన వేల మంది అన్నదాతలను అడ్డుకోవడానికి కేంద్రప్రభుత్వం పోలీసులకు సరికొత్త ఆయుధాలను ఇచ్చింది. రైతుల ఆందోళనను భగ్నం చేయడానికి వారి కర్ణభేరిని పగులగొట్టడమే పరిష్కారం అని కేంద ప్రభుత్వం భావిస్తోంది. అందుకే పోలీసులు దీర్ఘశ్రేణి అకౌస్టిక్ పరికరాలు, శబ్ధ ఫిరంగులను రాజధాని సరిహద్దులలో మోహరింపచేశారు. అవేం చేస్తాయంటే ఒకే దిశగా భారీ స్థాయిలో ధ్వనిని విడుదల చేస్తాయి. ఆ ధ్వని ధాటికి నిరసనకారులు తమ వినికిడి శక్తిని కోల్పోయే ప్రమాదం ఉంటుంది. ఈ ఎల్‌ఆర్‌ఏడీలను అమెరికా సైన్యం రెండువేల సంవత్సరంలో తయారుచేసుకుంది. ఢిల్లీ పోలీసులు 2013లో ఒక్కో దానికి 30 లక్షల రూపాయలు పెట్టి అయిదు ఎల్‌ఆర్‌ఏడీలను అమెరికా నుంచి కొనుగోలు చేశారు. పోలీసులు డ్రోన్ల సాయంతో రైతులపైకి పొగబాంబులను జారవిడుస్తున్నారు. రైతులు ఆ డ్రోన్లను కూల్చేందుకు పతంగులను ఎగరవేస్తున్నారు.