ప్రధానమంత్రి నరేంద్రమోదీ(Narendra modi) ఎన్నికల ప్రచారంలో(Election Campaign) మతాన్ని వాడుకుంటున్నా, జైశ్రీరామ్ అంటూ నినాదాలు ఇస్తున్నా, ముస్లింలపై(Muslims) సంచలన వ్యాఖ్యలు చేస్తున్నా ఎన్నికల సంఘం మాత్రం కుంభకర్ణుడిలా నిద్రపోతున్నదనే విమర్శలు వస్తున్నాయి. అదే తమకు మాత్రం నోటీసుల మీద నోటీసులు ఇస్తూ ఎన్నికల సంఘం వెళుతున్నదని విపక్షాలు మండిపడుతున్నాయి.
ప్రధానమంత్రి నరేంద్రమోదీ(Narendra modi) ఎన్నికల ప్రచారంలో(Election Campaign) మతాన్ని వాడుకుంటున్నా, జైశ్రీరామ్ అంటూ నినాదాలు ఇస్తున్నా, ముస్లింలపై(Muslims) సంచలన వ్యాఖ్యలు చేస్తున్నా ఎన్నికల సంఘం మాత్రం కుంభకర్ణుడిలా నిద్రపోతున్నదనే విమర్శలు వస్తున్నాయి. అదే తమకు మాత్రం నోటీసుల మీద నోటీసులు ఇస్తూ ఎన్నికల సంఘం వెళుతున్నదని విపక్షాలు మండిపడుతున్నాయి. నిన్నటికి నిన్న లోక్‌సభ ఎన్నికల ప్రచారంలో మోదీ కాంగ్రెస్‌పై తీవ్ర ఆరోపణలు చేశారు. రాజస్థాన్‌లోని జాలోర్‌లో ఆయన వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. కాంగ్రెస్‌పార్టీ అధికారంలోకి వస్తే ప్రజల ఆస్తులు, భూమి, బంగారాన్ని ముస్లింలకు పంచిపెడుతుందని అన్నారు. మీ కష్టార్జితాన్ని ముస్లింలకు పంచేందుకు మీరు అంగీకరిస్తారా? అని మోదీ ప్రశ్నించారు. ఆయన చేసిన వ్యాఖ్యలపై సోషల్ మీడియాలో పెద్ద దుమారం రేగుతోంది. ప్రధానమంత్రి పదవిలో ఉంటూ మత విద్వేష వ్యాఖ్యలు చేస్తున్నారని, ఎన్నికల నిబంధనలను ఉల్లఘించి ముస్లింలను టార్గెట్ చేస్తూ వ్యాఖ్యలు చేస్తున్నారని జనం విమర్శిస్తున్నారు. తెలుగు నటి శ్రేయ ధన్వంతరి కూడా బీజేపీని విమర్శిస్తూ సోషల్ మీడియాలో ఓ పోస్ట్ పెట్టారు. 'మనం ఇప్పుడు నటించడం మానేయగలమని నేను అనుకుంటున్నాను. ద్వేషం (Propaganda) అనే ప్రచారం ఇండియాలో జోరుగా సాగుతోంది' అని పోస్టు పెట్టారు. దీనిపై నెటిజన్ల నుంచి భిన్నాభిప్రాయాలు వస్తున్నాయి. కొందరు ఆమెకు మద్దతుగా నిలుస్తున్నారు. బీజేపీ వాళ్లు మాత్రం విమర్శిస్తున్నారు. ఆమె తన పోస్టులో మోదీ ప్రస్తావన తీసుకురాకపోయినా బీజేపీ వాళ్లు ఉలిక్కిపడుతున్నారు.