వరంగల్(Warangal) పర్యటనకు వచ్చిన ప్రధాని మోదీ(PM Modi) భద్రకాళి అమ్మవారిని(Goddess Bhadrakali) దర్శించుకున్నారు. ఆలయ ఆర్చకులు ఆయనకు పూర్ణకుంభంతో స్వాగతం పలికారు. గోసేవ అనంతరం ప్ర‌ధాని ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఆ త‌ర్వాత‌ వేదపండితులు ఆశీర్వచనం అందించారు.

వరంగల్(Warangal) పర్యటనకు వచ్చిన ప్రధాని మోదీ(PM Modi) భద్రకాళి అమ్మవారిని(Goddess Bhadrakali) దర్శించుకున్నారు. ఆలయ ఆర్చకులు ఆయనకు పూర్ణకుంభంతో స్వాగతం పలికారు. గోసేవ అనంతరం ప్ర‌ధాని ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఆ త‌ర్వాత‌ వేదపండితులు ఆశీర్వచనం అందించారు. అనంత‌రం హనుమకొండ(Hanumakonda) ఆర్ట్స్‌ కళాశాల(Arts College) మైదానంలో ఏర్పాటు చేసిన విజయ సంకల్ప సభకు బయల్దేరారు. బహిరంగసభ వేదిక వద్దకు చేరుకున్న త‌ర్వాత‌.. హనుమకొండలో రూ.6,109 కోట్ల విలువైన పనులకు ప్రధాని మోదీ శ్రీకారం చుట్టారు. రూ.521 కోట్లతో రైలు వ్యాగన్ల కర్మాగార నిర్మాణానికి, రూ.2,147 కోట్లతో జగిత్యాల-కరీంనగర్‌-వరంగల్‌ జాతీయరహదారి పనులకు, రూ.3,441 కోట్లతో మంచిర్యాల-వరంగల్‌ జాతీయరహదారి పనులకు ఆయన శంకుస్థాపన చేశారు.

అనంతరం తెలుగులో ప్రసంగం ప్రారంభించిన ప్రధాని తెలంగాణ ప్రజలందరికీ అభినందనలు తెలిపారు. దేశాభివృద్ధిలో తెలుగువారి ప్రతిభ కీలకంగా మారిందని అన్నారు. దేశానికి ఇది స్వర్ణ సమయమని చెప్పారు. తెలంగాణ ఏర్పడి 9 ఏళ్లు పూర్తయింది.. దేశాభివృద్ధిలో తెలంగాణది కీలక పాత్ర అని అన్నారు. అభివృద్ధిలోనూ తెలంగాణది ప్రధాన భూమిక అని కొనియాడారు. రూ.6వేల కోట్ల విలువైన ప్రాజెక్టులు ప్రారంభించుకుంటున్నాం.. దేశాభివృద్ధి కోసం శరవేగంగా పనులు పూర్తి చేస్తున్నామ‌న్నారు. హైవేలు, ఎక్స్‌ప్రెస్‌వేలు, ఇండస్ట్రియల్‌-ఎకనామిక్‌ కారిడార్లు ఏర్పాటు చేస్తున్నట్లు వెల్ల‌డించారు. తెలంగాణలో ముఖ్య చారిత్రక, ఆధ్యాత్మిక పర్యాటక కేంద్రాలున్నాయన్నారు. కరీంనగర్‌(Karimnagar)గ్రానైట్‌ పరిశ్రమకు కేంద్రం సహకారం అందిస్తుందని తెలిపారు. రైల్వే ఉత్పత్తుల విషయంలో రికార్డులు సృష్టిస్తున్నామ‌ని.. తెలంగాణలో రైల్వే రహదారుల కనెక్టివిటీ పెంచుతున్నామ‌ని ప్రధాని మోదీ తెలిపారు.

Updated On 8 July 2023 2:28 AM GMT
Ehatv

Ehatv

Next Story