కాంగ్రెస్(Congress) కుటుంబ రాజకీయాల వల్లే ఎన్సీపీ(NCP) జాతీయ అధ్యక్షుడు శరద్ పవార్(Sharad Power) ప్రధాని కాలేకపోయారని ప్రధాని నరేంద్ర మోదీ(Narendra Modi) అన్నారు. మంగళవారం మహారాష్ట్రలో బీజేపీ(BJP) నేతృత్వంలోని ఎన్డీయే ఫ్రంట్ ఎంపీలతో జరిగిన సమావేశంలో ప్రధాని ఈ వ్యాఖ్యలు చేశారు. కాంగ్రెస్ బంధుప్రీతితో ప్ర‌ణ‌బ్ ముఖ‌ర్జీ(Pranab Mukherjee), శ‌ర‌ద్ ప‌వార్ వంటి ప్రతిభావంతులను ప్రోత్సహించలేదని అన్నారు.

శరద్ పవార్ బీజేపీకి దగ్గరవుతారనే ప్రచారం జరుగుతుంది. ఈ నేపథ్యంలో ప్రధాని వ్యాఖ్య‌లు ఆస‌క్తిక‌రంగా మారాయి. శరద్ పవార్ కూడా ఏడేళ్ల తర్వాత ఈ నెల ప్రారంభంలో ప్రధానితో వేదికను పంచుకున్నారు. ఎన్‌సీపీ విపక్షాల I-N-D-I-A ఫ్రంట్‌లో భాగమైనప్పటికీ.. ప‌వార్ అవార్డ్ కార్య‌క్ర‌మంలో మోదీతో వేదికను పంచుకున్నారు. దీనిపై విపక్షాల నుండి విమర్శలు కూడా వచ్చాయి.

అయితే ఎంపీలతో జరిగిన సమావేశంలో ప్రధాని నరేంద్ర మోదీ.. ఉద్ధవ్ ఠాక్రే నేతృత్వంలోని శివసేనపై కూడా విమర్శలు చేశారు. శివసేనతో పొత్తు తెగతెంపులు చేసుకుంది తాము కాదని.. శివసేననే ఆ ప‌ని చేసింద‌ని అని అన్నారు. శివ‌సేన‌ మౌత్ పీస్ సామ్నా ప్రభుత్వంపై నిరంతరం విమర్శలు గుప్పించింది. మేము దానిని క్షమించాము. శివ‌సేన(షిండే వ‌ర్గం), బీజేపీ రెండూ ఎలా కలిసిపోతాయి..?.. తామే అధికారంలో ఉండాల‌ని విమర్శలు కూడా కొనసాగిస్తున్నారు. ఏకనాథ్ షిండే మాతో కలిసి ప‌నిచేస్తున్నారు. మేం కలిసి నిలబడతామ‌న్నారు. ఎన్డీయేలో చేరాలనుకునే పార్టీలను స్వాగతిస్తున్నట్లు ప్రధాని చెప్పారు.

గత నెలలో ఎన్‌సిపి నిలువునా చీలిపోయింది. ఈ నేప‌థ్యంలో ప్రధాని వ్యాఖ్యలు ప్రాధాన్య‌త‌ను సంత‌రించుకున్నాయి. అజిత్ పవార్, మరో ఎనిమిది మంది పార్టీ ఎమ్మెల్యేలు ఏక్నాథ్ షిండే నేతృత్వంలోని మహారాష్ట్ర ప్రభుత్వంలో చేరారు. రాష్ట్ర ఉప ముఖ్యమంత్రిగా అజిత్ పవార్ ప్రమాణ స్వీకారం చేశారు.

Updated On 9 Aug 2023 4:45 AM GMT
Ehatv

Ehatv

Next Story