సార్వత్రిక ఎన్నికలు(General elections) దగ్గరపడుతున్నాయి. ఎన్నికలలో లబ్ధి పొందడానికి కేంద్రంలోని బీజేపీ(BJP) ప్రభుత్వం ఇప్పట్నుంచే రకరకాల తాయిలాలు ప్రకటిస్తోంది. అయోధ్య రామమందిరం(Ayodhya Ram Mandir) ప్రచారం ఎలాగూ చేసుకుంటుంది. దాంతో పాటు పెట్రో ధరలపై(petro prices) ప్రజలలో ఉన్న అసంతృప్తిని దూరం చేయడానికి, ప్రజలకు కాస్త ఉపశమనం కలిగించడానికి కేంద్రం ప్రణాళికలను సిద్ధం చేసుకుంటోంది.

సార్వత్రిక ఎన్నికలు(General elections) దగ్గరపడుతున్నాయి. ఎన్నికలలో లబ్ధి పొందడానికి కేంద్రంలోని బీజేపీ(BJP) ప్రభుత్వం ఇప్పట్నుంచే రకరకాల తాయిలాలు ప్రకటిస్తోంది. అయోధ్య రామమందిరం(Ayodhya Ram Mandir) ప్రచారం ఎలాగూ చేసుకుంటుంది. దాంతో పాటు పెట్రో ధరలపై(petrol prices) ప్రజలలో ఉన్న అసంతృప్తిని దూరం చేయడానికి, ప్రజలకు కాస్త ఉపశమనం కలిగించడానికి కేంద్రం ప్రణాళికలను సిద్ధం చేసుకుంటోంది. రాజస్తాన్‌(Rajasthan), మధ్యప్రదేశ్‌(Madhya Pradesh), చత్తీస్‌గఢ్‌(Chattisgargh) రాష్ట్రాలలో లభించిన గెలుపుతో ఊపు మీద ఉన్న బీజేపీ 2024లో జరిగే లోక్‌సభ ఎన్నికల్లో(Lok Sabha) ఘన విజయం సాధించాలని అనుకుంటోంది. పెట్రోల్‌(Petrol), డీజిల్(Diesel) ధరలను లీటర్‌కు ఆరు నుంచి పది రూపాయల వరకు తగ్గించాలని మోదీ(Narendra modi) సర్కార్‌ అనుకుంటోంది. ధరల తగ్గింపునకు సంబంధించిన ప్రతిపాదలను ఇప్పటికే పెట్రోలియం శాఖ అధికారులు మోదీ ఆమోదం కోసం పంపించారట! అంతర్జాతీయ మార్కెట్లో చమురు ధరలు తగ్గినప్పటికీ ఆ మేరకు రిటైల్‌ అమ్మకం ధరలను సంస్థలు తగ్గించలేదు. ఫలితంగా ఇండియన్ ఆయిల్ కార్పొరేషన్, భారత్ పెట్రోలియం కార్పొరేషన్, హెచ్‌పీసీఎల్‌ ప్రస్తుత ఆర్థిక సంవత్సర తొలి ఆరు నెలల్లో ఏకంగా 58, 198 కోట్ల రూపాయల ఆదాయం గడించాయి.. చివరిసారిగా 2022 మే 22వ తేదీన కేంద్రం పెట్రోల్, డీజిల్ పై ఎక్సైజ్ సుంకాన్ని తగ్గించింది. దీంతో లీటర్ పెట్రోల్ ధర ఎనిమిది రూపాయలు, లీటర్ డీజిల్ ధర ఆరు రూపాయల మేర తగ్గింది.

Updated On 29 Dec 2023 2:02 AM GMT
Ehatv

Ehatv

Next Story