లోక్‌సభ ఎన్నికల ఫలితాలు చూశాక అందరూ సైలెంట్ గా అయిపోయారని

ఎలక్ట్రానిక్ ఓటింగ్ మెషీన్ల (ఈవీఎంలు) విశ్వసనీయత గురించి ఇండియా కూటమి చేసిన ఆరోపణలపై నరేంద్ర మోదీ విరుచుకుపడ్డారు. లోక్‌సభ ఎన్నికల ఫలితాలు చూశాక అందరూ సైలెంట్ గా అయిపోయారని అన్నారు. తనను తమ నాయకుడిగా ఎన్నుకున్న ఎన్‌డిఏ ఎంపీలను ఉద్దేశించి మాట్లాడుతూ.. ఈవీఎంలు, ఆధార్ వంటి సాంకేతిక పురోగతులను ప్రశ్నించినప్పుడు ఇండియా కూటమిలోని వ్యక్తులు గత శతాబ్దానికి చెందిన వారని నేను బలంగా భావిస్తున్నానని అన్నారు. ఫలితాల తర్వాత ఈవీఎంలను, ఎన్నికల సంఘాన్ని ప్రశ్నించే వారి నోరు మూయించడమే భారత ప్రజాస్వామ్య శక్తి అని ఆయన అన్నారు.

కాంగ్రెస్ 10 ఏళ్ల తర్వాత కూడా 100 మార్కును తాకలేకపోయిందని.. గత మూడు లోక్‌సభ ఎన్నికల్లో వారి మొత్తం సీట్లు ఈ ఎన్నికల్లోనే మా సంఖ్య కంటే తక్కువగానే ఉన్నాయని అన్నారు ప్రధాని మోదీ. NDA ఈ ఎన్నికల్లో 293 సీట్లు గెలుచుకుంది, బీజేపీ ఒంటరిగా 240 సీట్లు గెలుచుకుంది.. ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయడానికి అవసరమైన మెజారిటీ మార్క్ 272 కంటే కొంచెం తక్కువ. పదేళ్లలో ఆ పార్టీ మెజారిటీ కోల్పోవడం ఇదే తొలిసారి.

Updated On 7 Jun 2024 4:10 AM GMT
Yagnik

Yagnik

Next Story