ప్రపంచంలోనే అతిపెద్ద ఎలక్ట్రిక్ కార్ల(Electric Car) తయారీ సంస్థ టెస్లా(Tesla) సీఈవో ఎలాన్ మస్క్(Elan Mask), ప్రధాని మోదీ(PM MODI) అమెరికాలో(america) సమావేశమయ్యారు. వీరిద్దరి భేటీ తర్వాత టెస్లా ఎలక్ట్రిక్ కార్లు(Tesla ELectric Car) భారత్‌లో అందుబాటులోకి వస్తాయా.. లేదా.. మరింత సమయం పడుతుందా అనే ఆస‌క్తి నెల‌కొంది. అమెరికా పర్యటనలో ఉన్న ప్రధాని మోదీ పలువురు ప్రముఖులను కలుస్తున్నారు.

ప్రపంచంలోనే అతిపెద్ద ఎలక్ట్రిక్ కార్ల(Electric Car) తయారీ సంస్థ టెస్లా(Tesla) సీఈవో ఎలాన్ మస్క్(Elon Musk), ప్రధాని మోదీ(PM MODI) అమెరికాలో(america) సమావేశమయ్యారు. వీరిద్దరి భేటీ తర్వాత టెస్లా ఎలక్ట్రిక్ కార్లు(Tesla ELectric Car) భారత్‌లో అందుబాటులోకి వస్తాయా.. లేదా.. మరింత సమయం పడుతుందా అనే ఆస‌క్తి నెల‌కొంది. అమెరికా పర్యటనలో ఉన్న ప్రధాని మోదీ పలువురు ప్రముఖులను కలుస్తున్నారు. ఈ క్రమంలో ప్రధాని మోదీ, టెస్లా సీఈవో ఎలాన్ మస్క్‌లు కూడా సమావేశమయ్యారు. వీరిద్దరి భేటీకి సంబంధించిన ఫోటో కూడా ప్రధాని మోదీ సోషల్ మీడియా ఖాతాలో షేర్ చేశారు.

మీడియా నివేదికల ప్రకారం.. టెస్లా త్వరలో భారతదేశంలోకి ప్రవేశించవచ్చు. ప్రధాని మోదీని కలిసిన తర్వాత ఎలాన్ మస్క్ ఈ విషయాన్ని వెల్లడించారు. భారత్‌లో వీలైనంత త్వరగా పెట్టుబడులు పెట్టాలనుకుంటున్నట్లు ఆయన తెలిపారు. టెస్లా భారతదేశంలో ఉంటుందని నేను ఖచ్చితంగా అనుకుంటున్నాను. త్వరలో ఇది సాధ్యమవుతుంది. మద్దతు ఇచ్చినందుకు ప్రధాని మోదీకి కృతజ్ఞతలు తెలుపుతున్నాను. భవిష్యత్తులో మేము ప్రకటన చేయగలమని ఆశిస్తున్నాము. వచ్చే ఏడాది తాను భారతదేశాన్ని సందర్శించవచ్చని మ‌స్క్‌ చెప్పాడు.

అమెరికాలో(America) ప్రధాని మోదీని కలవడానికి ముందు కూడా ఎలోన్ మస్క్ భారత్‌కు రావడం గురించి మాట్లాడారు. కంపెనీ త్వరలో భారత(India) మార్కెట్లోకి ప్రవేశించగలదని మస్క్ చెప్పారు. భారతదేశంలో కొత్త ఫ్యాక్టరీని స్థాపించడానికి టెస్లా ఆసక్తి చూపుతుందా అని మస్క్‌ని అడిగినప్పుడు.. సానుకూలంగా బదులిచ్చారు.

ఇటీవలే కొంతమంది టెస్లా ఎగ్జిక్యూటివ్‌లు అవకాశాలను అన్వేషించడానికి భారత మార్కెట్‌ను కూడా సందర్శించారు. ఈ సందర్భంగా వారు భారత ప్రభుత్వ అధికారులను కూడా కలిశారు. ఈ భేటీలో టెస్లా అధికారులు భారతదేశంలో తయారీ కర్మాగారం యూనిట్‌ను ఏర్పాటు చేయడం గురించి చ‌ర్చించిన‌ట్లు నివేదికల పేర్కొన్నాయి.

Updated On 21 Jun 2023 1:01 AM GMT
Ehatv

Ehatv

Next Story