అయోధ్య(Ayodhya) రామమందిర(Ram mandir) ప్రాణప్రతిష్ట కార్యక్రమం దగ్గరకొచ్చేసింది. కేంద్ర ప్రభుత్వం ఆలయ నిర్మాణాన్ని ప్రతిష్టాత్మకంగా తీసుకుంది. రామాలయం నిర్మాణం తన చేతుల మీదుగా జరగడం తన పూర్వ జన్మ సుకృతంగా భావిస్తున్నానని ప్రధాని నరేంద్రమోదీ(PM Narendra modi) అన్నారు. ఆలయ గర్భగుడిలో విగ్రహ ప్రతిష్టాపన కార్యక్రమానికి ముందే జనవరి 12వ తేదీ నుంచి అనుష్టాన కార్యక్రమాన్ని ప్రధాని మోదీ ప్రారంభించారు.
అయోధ్య(Ayodhya) రామమందిర(Ram mandir) ప్రాణప్రతిష్ట కార్యక్రమం దగ్గరకొచ్చేసింది. కేంద్ర ప్రభుత్వం ఆలయ నిర్మాణాన్ని ప్రతిష్టాత్మకంగా తీసుకుంది. రామాలయం నిర్మాణం తన చేతుల మీదుగా జరగడం తన పూర్వ జన్మ సుకృతంగా భావిస్తున్నానని ప్రధాని నరేంద్రమోదీ(PM Narendra modi) అన్నారు. ఆలయ గర్భగుడిలో విగ్రహ ప్రతిష్టాపన కార్యక్రమానికి ముందే జనవరి 12వ తేదీ నుంచి అనుష్టాన కార్యక్రమాన్ని ప్రధాని మోదీ ప్రారంభించారు. అప్పటి నుంచి ప్రధాని కఠిన నియమాలు పాటిస్తున్నారని చెబుతున్నారు. ఆయన కేవలం నేలపైనే నిద్రిస్తున్నారట! కేవలం కొబ్బరినీళ్లు మాత్రమే తాగుతున్నారట! 11 రోజుల అనుష్టానంలో భాగంగాఆయన కఠిన నియమాలు పాటిస్తున్నారట! సాత్వికాహారం స్వీకరిస్తున్నారట! సమయం చిక్కినప్పుడల్లా రామనామం జపిస్తున్నారట! తన నివాసంలో రాముడికి పూజలు చేస్తున్నారట. అయోధ్యలో రామమందిర ప్రారంభోత్సవానికి ప్రధాన యజమానిగా మోదీ వ్యవహరించనున్నారు. జనవరి 22న రామ్‌లల్లా ప్రాణప్రతిష్టతో మోదీ అనుష్టానం ముగుస్తుంది. జనవరి 22న జరగనున్న అయోధ్య రాముని ప్రతిష్ఠాపన కార్యక్రమం జరగనుంది. ప్రధాని మోదీ ముఖ్య అతిథిగా ఈ వేడుకకు హాజరుకానున్నారు. దేశవ్యాప్తంగా ప్రముఖులను ఈ కార్యక్రమానికి ఆహ్వానించారు. మొత్తంగా ప్రాణప్రతిష్ఠ కార్యక్రమానికి 7,000 మంది హాజరుకానున్నారు. 100 మంది విదేశీ ప్రముఖులు కూడా ఈ వేడుకకు రానున్నారు.