ప్రపంచంలోనే అతిపెద్ద ధ్యాన కేంద్రాన్ని(Meditation center) వారణాసిలో ప్రధాని మోడీ(PM Narendra Modi) ప్రారంభించారు. అతిపెద్ద ధ్యాన కేంద్రమైన స్వర్‌వేద్ మహామందిరాన్ని(Swarved Mahamandir) ఉత్తరప్రదేశ్ సీఎం(UP CM) యోగి ఆదిత్యనాథ్‌తో కలిసి ప్రారంభించారు. రెండు రోజుల పాటు సొంత నియోజకవర్గంలో పర్యటిస్తున్న మోడీ.. ధ్యాన కేంద్రంలో కలియతిరుగుతూ పరిశీలించారు.
ప్రపంచంలోనే అతిపెద్ద ధ్యాన కేంద్రాన్ని(Meditation center) వారణాసిలో ప్రధాని మోడీ(PM Narendra Modi) ప్రారంభించారు. అతిపెద్ద ధ్యాన కేంద్రమైన స్వర్‌వేద్ మహామందిరాన్ని(Swarved Mahamandir) ఉత్తరప్రదేశ్ సీఎం(UP CM) యోగి ఆదిత్యనాథ్‌తో కలిసి ప్రారంభించారు. రెండు రోజుల పాటు సొంత నియోజకవర్గంలో పర్యటిస్తున్న మోడీ.. ధ్యాన కేంద్రంలో కలియతిరుగుతూ పరిశీలించారు. ఒకే సారి 20 వేల మంది ధ్యానం చేసుకునేందుకు ఇందులో ఏర్పాట్లు చేశారు. ఈ సందర్భంగా మోడీ మాట్లాడుతూ కాశీ(Kashi) ఎప్పడు వచ్చినా సొంతింటికి వచ్చిన అనుభూతి కలుగుతుందని.. ఇక్కడ గడిపే ప్రతీక్షణం తనకు అద్భుతంగా ఉంటుందన్నారు. అభివృద్ధి, కొత్త నిర్మాణాల్లో కాశీ ప్రజలు రికార్డులు సృష్టించారని ఆయన అన్నారు. ఇందుకు ఈ ధ్యాన కేంద్రమే నిదర్శనమని తెలిపారు. దీంతో పాటు వారణాసి-ఢిల్లీ మధ్య వందేభారత్ రైలును ప్రధాని మోడీ ప్రారంభించనున్నారు. ఈ రైలు కషాయరంగులో ఉండనుంది.