జనవరి 22న జరగనున్న రామ మందిర(Ram mandir) ప్రతిష్ఠాపన వేడుకకు ఘనంగా ఏర్పాట్లు జరుగుతున్నాయి. 11 రోజుల పాటు జరిగే పూజా కార్యక్రమాలను ఈ సందర్భంగా ప్రధాని నరేంద్ర మోడీ(PM Narendra Modi) ఈరోజు ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన దేశ ప్రజలనుద్దేశించి ఆడియో సందేశాన్ని(Audio Message) విడుదల చేశారు. ఈ సందర్భంగా ప్రధాని మాట్లాడుతూ.. నేను భావోద్వేగానికి లోనయ్యా.

జనవరి 22న జరగనున్న రామ మందిర(Ram mandir) ప్రతిష్ఠాపన వేడుకకు ఘనంగా ఏర్పాట్లు జరుగుతున్నాయి. 11 రోజుల పాటు జరిగే పూజా కార్యక్రమాలను ఈ సందర్భంగా ప్రధాని నరేంద్ర మోడీ(PM Narendra Modi) ఈరోజు ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన దేశ ప్రజలనుద్దేశించి ఆడియో సందేశాన్ని(Audio Message) విడుదల చేశారు. ఈ సందర్భంగా ప్రధాని మాట్లాడుతూ.. "నేను భావోద్వేగానికి లోనయ్యా. నా జీవితంలో మొదటిసారిగా ఇంతటి అనుభూతి ఎప్పుడూ పొందలేదంటూ" ట్విట్టర్‌లో 10 నిమిషాల ఆడియో సందేశం ఇచ్చారు. అయోధ్యలోని కొత్త రామ మందిరంలో బాలరాముడి విగ్రహాన్ని ఉంచే “ప్రాణ్ ప్రతిష్ఠ” వేడుకను చూడగలగడం తన అదృష్టమని ప్రధాని మోడీ అన్నారు.

ఈ ఘటనను "చారిత్రాత్మకమైన, పవిత్రమైన క్షణంగా ఆయన అభివర్ణించారు. ఈ సమయంలో భారతీయులందరికీ ప్రాతినిధ్యం వహించే వ్యక్తిగా దేవుడు తనను ఎంచుకున్నాడని తెలిపారు. ఇందుకోసం సాధువులు, పురాణాలు సూచించినట్లు ఈ 11 రోజులు నిష్టతో ఉండి పూజలు చేస్తానని వెల్లడించారు. ఈ ఆధ్యాత్మిక ప్రయణాంలో నాకు సాధువుల నుంచి మార్గదర్శకత్వం లభించిందని మోడీ తెలిపారు. స్వామి వివేకానంద(Swami Vivekananda) జయంతి సందర్బంగా ప్రధాని మోడీ ఆయనను స్మరించుకున్నారు. ఛత్రపతి శివాజీ(Chhatrapati Shivaji) తల్లి జిజాబాయితో(Jijabhai) పాటు తన తల్లిని మోడీ గుర్తుచేసుకున్నారు.

అంతే కాకుండా తన నమో యాప్ ద్వారా తనను సంప్రదించి.. ఆశీర్వాదాలు అందించాలని భారతీయలును కోరారు. ఎన్నో తరాలు, ఏళ్ల తరబడి ప్రతిష్ఠాత్మకంగా భావిస్తున్న కల, నెరవేరడం అదృష్టం. ఈ కార్యక్రమానికి దేవుడు నన్ను ఒక సాధనంగా ఉపయోగించుకుంటున్నాడని.. నేను ఒక సాధనం మాత్రమేనని.. నాకు ఇది చాలా పెద్ద బాధ్యత" అని ప్రధాన మంత్రి అన్నారు.

Updated On 25 March 2024 6:17 AM GMT
Ehatv

Ehatv

Next Story