ప్రధానమంత్రి నరేంద్రమోదీ ఈరోజు కొత్త పార్లమెంట్ భవనాన్ని జాతికి అంకితం చేశారు. ప్రారంభోత్సవానికి ముందు.. కొత్త పార్లమెంటు భవనాన్ని నిర్మించిన కార్మికులను ప్రధాని మోదీ శాలువా కప్పి సత్కరించారు. ఈ సమయంలో వారికి జ్ఞాపికలను కూడా అందజేశారు. ప్రారంభోత్సవ వేడుకకు ముందు.. ప్రధాని మోదీ 'సెంగోల్'కు నమస్కరించారు.
ప్రధానమంత్రి నరేంద్రమోదీ(PM Modi) ఈరోజు కొత్త పార్లమెంట్ భవనాన్ని(New Parliament Building) జాతికి అంకితం చేశారు. ప్రారంభోత్సవానికి ముందు.. కొత్త పార్లమెంటు భవనాన్ని నిర్మించిన కార్మికులను ప్రధాని మోదీ శాలువా కప్పి సత్కరించారు. ఈ సమయంలో వారికి జ్ఞాపికలను కూడా అందజేశారు. ప్రారంభోత్సవ వేడుకకు ముందు.. ప్రధాని మోదీ 'సెంగోల్'కు నమస్కరించారు. దీని తరువాత.. కొత్త పార్లమెంట్ భవనంలోని లోక్‌సభ స్పీకర్(Loksabha Speaker) కుర్చీకి సమీపంలో 'సెంగోల్' రాజదండాన్ని ప్రధాని మోదీ అమర్చారు. కొత్త పార్లమెంట్ హౌస్‌లో దాని స్థాపనకు ముందు.. చారిత్రాత్మక 'సెంగోల్'ను అదినామ్స్ (హిందూ మఠాల అధిపతులు) ప్రధాని మోదీకి అందజేశారు. అమృత్ కాల్ జాతీయ చిహ్నంగా.. పార్లమెంటు భవనంలో 'సెంగోల్' ఏర్పాటు చేయబడింది. 'సెంగోల్' స్థాపన తర్వాత.. ప్రధానమంత్రి తమిళనాడు(Tamilnadu)లోని వివిధ హిందూ మఠాల అధిపతులు నుండి సాధువుల ఆశీస్సులను కూడా పొందారు. అంతకుముందు, 'సెంగోల్'కు కాంగ్రెస్(Congress) తగిన గౌరవం ఇవ్వలేదని ప్రధాని నరేంద్ర మోదీ శనివారం అన్నారు.
కొత్త పార్లమెంట్ హౌస్ ప్రారంభోత్సవ కార్యక్రమం వైదిక ఆచారాలను అనుసరించి సాంప్రదాయ 'పూజ'తో ప్రారంభమైంది. పూజ సమయంలో ప్రధాని మోదీతో పాటు లోక్‌సభ స్పీకర్ ఓం బిర్లా(Lok Sabha Speaker Om Birla) కూడా ఉన్నారు. పూజల అనంతరం నూతన భవనంలోని లోక్‌సభ ఛాంబర్, రాజ్యసభ ఛాంబర్ ప్రాంగణాన్ని ఉన్నతాధికారులు పరిశీలిస్తారని చెబుతున్నారు.
7:30 నుండి 8:30 వరకు మొదటి దశలో హవాన్ మరియు ఆరాధన
సెంగోల్ 8:30 నుంచి 9:00 మధ్య ఏర్పాటు చేయబడింది
ఉదయం 9:00 గంటలకు లోక్‌సభ ఛాంబర్‌లో కార్యక్రమం
ఉదయం 9.30 గంటలకు పార్లమెంటు లాబీలో ప్రార్థనా సమావేశం
12:07కి జాతీయ గీతం, 12:10కి రాజ్యసభ డిప్యూటీ చైర్మన్ స్వాగత ప్రసంగం
మధ్యాహ్నం 12:17 నుంచి పార్లమెంట్‌లో రెండు సినిమాల ప్రదర్శన
12:29కి ఉపరాష్ట్రపతి ధంఖర్ సందేశం, తర్వాత రాష్ట్రపతి సందేశం
మధ్యాహ్నం 12:43 గంటలకు లోక్‌సభ స్పీకర్ ఓం బిర్లా ప్రసంగం
మధ్యాహ్నం 1:00 గంటలకు ప్రత్యేక నాణెం మరియు ముద్రను ప్రధాని విడుదల చేస్తారు
1:10 గంటలకు ప్రధాని మోదీ ప్రసంగం. అనంతరం మధ్యాహ్నం 1.30 గంటలకు ధన్యవాద తీర్మానం.