ప్రధానమంత్రి నరేంద్ర మోదీకి(PM narendra modi) ఓటమి భయం పట్టుకున్నట్టుగా ఉంది. అందుకే తన ప్రచారంలో పదే పదే ముస్లింలను(Muslim) టార్గెట్ చేస్తున్నారు. మత విద్వేషాలను రెచ్చగొట్టి రాజకీయలబ్ధి పొందాలన్నది ఆయన ఉద్దేశం కాబోలు. కర్ణాటక అసెంబ్లీ ఎన్నికప్పుడు బజరంగ్ బళిని ప్రచారాస్త్రంగా వాడుకున్న మోదీ ఇప్పుడు హనుమాన్‌చాలీసాను(Hanuman chalisa) వాడుకుంటున్నారు
ప్రధానమంత్రి నరేంద్ర మోదీకి(PM narendra modi) ఓటమి భయం పట్టుకున్నట్టుగా ఉంది. అందుకే తన ప్రచారంలో పదే పదే ముస్లింలను(Muslim) టార్గెట్ చేస్తున్నారు. మత విద్వేషాలను రెచ్చగొట్టి రాజకీయలబ్ధి పొందాలన్నది ఆయన ఉద్దేశం కాబోలు. కర్ణాటక అసెంబ్లీ ఎన్నికప్పుడు బజరంగ్ బళిని ప్రచారాస్త్రంగా వాడుకున్న మోదీ ఇప్పుడు హనుమాన్‌చాలీసాను(Hanuman chalisa) వాడుకుంటున్నారు. రాజస్తాన్ ఎన్నికల ప్రచారంలో పాల్గొన్న మోదీ మళ్లీ కాంగ్రెస్‌పార్టీపై(Congress Party) విరుచుకుపడ్డారు. 'మూడు రోజుల క్రితం కాంగ్రెస్ ఓటు బ్యాంకు రాజకీయాలను నేను బయటపెట్టాను. సంపదను దోచుకుని కొంతమంది వ్యక్తులకు పంచిపెట్టాలన్న వారి కుట్రలను దేశ ప్రజల ముందుంచాను. దీంతో కాంగ్రెస్, విపక్ష కూటమికి నాపై కోపం వచ్చింది. అందుకే వారు నాపై నిందలు వేయడం మొదలుపెట్టారు' అని మోదీ అన్నారు. కాంగ్రెస్ పాలనలో ప్రజలు తమ విశ్వాసాలను స్వేచ్ఛగా అనుసరించలేకపోతున్నారని అన్నారు. కనీసం హనుమాన్ చాలీసా విన్నా అది నేరం అయిపోయిందని చెప్పారు. గతంలో రాజస్థాన్‌లోనూ ఆ పార్టీ అధికారంలో ఉన్నప్పుడు రామనవమి ఉత్సవాలపై నిషేధం విధించారని ప్రధాని ఆరోపించారు.