ప్రధానమంత్రి నరేంద్ర మోడీ(Narendra modi) ట్విట్టర్(Twitter) ద్వారా కీలక ప్రకటన చేశారు. బీజేపీ కురువృద్ధుడు అద్వానీకి(Adwani) దేశ అత్యున్నత పురస్కారం భారతరత్న(Bharat Ratna) అందజేయనున్నట్లు తెలిపారు. ఈ విషయాన్ని తెలియజేయడం చాలా సంతోషంగా ఉందని ఆయన వెల్లడించారు. ఇదే విషయాన్ని అద్వానీకి ఫోన్ చేసి మోడీ కంగ్రాట్స్ చెప్పారు. భారతరత్న గౌరవం అందుకోబోతున్న ఎల్‌కే అద్వానీతో(LK Adwani) నేను మాట్లాడి అభినందనలు తెలిపా.
ప్రధానమంత్రి నరేంద్ర మోడీ(Narendra modi) ట్విట్టర్(Twitter) ద్వారా కీలక ప్రకటన చేశారు. బీజేపీ కురువృద్ధుడు అద్వానీకి(Adwani) దేశ అత్యున్నత పురస్కారం భారతరత్న(Bharat Ratna) అందజేయనున్నట్లు తెలిపారు. ఈ విషయాన్ని తెలియజేయడం చాలా సంతోషంగా ఉందని ఆయన వెల్లడించారు. ఇదే విషయాన్ని అద్వానీకి ఫోన్ చేసి మోడీ కంగ్రాట్స్ చెప్పారు. భారతరత్న గౌరవం అందుకోబోతున్న ఎల్‌కే అద్వానీతో(LK Adwani) నేను మాట్లాడి అభినందనలు తెలిపా. అద్వానీ అత్యంత గౌరవనీయులైన రాజనీతిజ్ఞులలో ఆయన ఒకరు. దేశాభివృద్ధికి ఆయన చేసిన కృషి చిరస్మరణీయమైనది. కార్యకర్త నుంచి పని ప్రారంభించి ఉప ప్రధానిగా దేశానికి సేవ చేసే అత్యున్నత స్థాయికి ఆయన ఎదిగారని మోడీ అన్నారు. హోంమంత్రిగా, ఐఅండ్‌బీ మంత్రిగా కూడా సేవలు అందించారు. పార్లమెంట్‌లో ఆయన అడుగులు ఎల్లప్పుడూ ఆదర్శప్రాయమైనవి, గొప్ప దూరదృష్టితో నిండి ఉన్నాయి అని ప్రధాని మోదీ ట్వీట్ చేశారు.
దేశ రాజకీయల్లో "లోహ పురుషుడు" గా ప్రసిద్ధి గాంచిన ఎల్.కె. అద్వానీ 1927 జూన్ 8న సింధ్ ప్రాంతంలోని కరాచి పట్టణంలోని సంపన్న వ్యాపార కుటుంబంలో జన్మించారు. 15 సం.ల వయస్సులోనే ఆర్‌ఎస్‌ఎస్‌లో ప్రవేశించారు. దేశ విభజన సమయంలో భారత దేశానికి వలస వచ్చి తరువాత దేశ రాజకీయాలకే అంకితమయ్యారు. భారతీయ జనసంఘ్ పార్టీలో చేరి అనతి కాలంలోనే ముఖ్య పదవులు పొందారు. 1967లో ఢిల్లీ మున్సిపల్ కార్పొరేషన్ అధ్యక్షుడయ్యారు. 1977లో మురార్జీ దేశాయ్ ప్రభుత్వంలో మంత్రిపదవి.. 1980లో భారతీయ జనతా పార్టీ ఏర్పడిన తరువాత దేశ రాజకీయాలలో ప్రముఖ పాత్ర వహించే అవకాశం లభించింది. వాజపేయి నేతృత్వంలోని భారతీయ జనతా పార్టీ ప్రభుత్వంలో కీలకమైన హోంశాఖ పదవిని నిర్వహించారు. 2009 ఎన్నికలకు ముందే బీజేపీ ప్రధాని అభ్యర్థిగా అద్వానీ పేరు ప్రకటించారు. ప్రస్తుతం గుజరాత్‌లోని గాంధీనగర్ లోక్‌సభ నియోజకవర్గం నుంచి ప్రాతినిధ్యం వహిస్తున్నారు.