కర్ణాటకలో(Karnataka) అధికారం చేజారిపోతున్నదని గ్రహించిన భారతీయ జనతా పార్టీ(BJP) ఎప్పటిలాగే చివరి అస్త్రంగా మతం, ఉగ్రవాదం వంటివాటిని తెరమీదకు తెచ్చింది. ఎన్నికల ప్రచారంలో ప్రధాని(PM modi) నోటి వెంట ద కేరళ స్టోరీ(Kerala story) సినిమా ప్రస్తావన రావడం ఇందులోని భాగమే!
కర్ణాటకలో(Karnataka) అధికారం చేజారిపోతున్నదని గ్రహించిన భారతీయ జనతా పార్టీ(BJP) ఎప్పటిలాగే చివరి అస్త్రంగా మతం, ఉగ్రవాదం వంటివాటిని తెరమీదకు తెచ్చింది. ఎన్నికల ప్రచారంలో ప్రధాని(PM modi) నోటి వెంట ద కేరళ స్టోరీ(Kerala story) సినిమా ప్రస్తావన రావడం ఇందులోని భాగమే! తాము అధికారంలోకి వస్తే ఏం చేస్తామో చెప్పకుండా కేరళ గురించి మాట్లాడుతున్నారంటే అందులోని అంతరార్థమేమిటో, అంతర్ధానమేమిటో సులభంగా అర్థం చేసుకోవచ్చు.
కేరళలో చోటు చేసుకున్న ఉగ్ర కుట్రలను ద కేరళ స్టోరీ చిత్రం బట్టబయలు చేస్తున్నదని, ఆ రాష్ట్రంలో ముష్కర మూకల ఆగడాలు, మోసపూరిత విధానాలపై చిత్రం నిర్మించారని మోదీ చెప్పుకొచ్చారు. నిర్మాతలు మాత్రం ఇది కల్పిత కథేనని, కేవలం ముగ్గురు అమ్మాయిలకు చెందిన ఇతివృత్తం మాత్రమేనని చెబుతున్నారు. కాంగ్రెస్ తన మేనిఫెస్టోలో బజరంగ్‌దళ్‌ను నిషేధిస్తామని ఎక్కడా చెప్పలేదు.
మత విద్వేషాలను రెచ్చగొట్టి, శాంతి భద్రతలకు విఘాతం కలిగిస్తే చట్టపరమైన చర్యలు తీసుకుంటామని చెప్పింది. బజరంగ్‌దళ్ ఆగడాలు మితిమీరితే నిషేధం విధిస్తామని మాత్రమే చెప్పింది. దానికే భజరంగ్‌బలిని కాంగ్రెస్ నిషేధిస్తామని చెప్పిందంటూ ప్రధాని నరేంద్రమోదీ చెప్పడం ఆశ్చర్యాన్ని కలిగించింది. అసలు బజరంగ్‌దళ్‌కు, భజరంగ్‌బలికి లింకేమిటో అర్థం కావడం లేదు.
ఇప్పుడు కేరళ స్టోరీని పట్టుకున్నారు. ఆ సినిమాను ప్రమోట్ చేయడానికి నానా తంటాలు పడుతున్నారు. సినిమాను పదే పదే ప్రస్తావిస్తూ విద్వేష మంటలను రాజేయడానికి ప్రయత్నిస్తున్నారు. సినిమాకు ప్రధాని మద్దతు పలకడమే కాదు, నిర్మాతలను ఆకాశానికెత్తారు. ఇక బీజేపీ అయితే కేరళతో పాటు మరికొన్ని రాష్ట్రాలలో ఈ సినిమాను ప్రత్యేకంగా ప్రదర్శిస్తున్నారు. ఉచిత షోలను వేస్తున్నారు. సినిమాకు పన్ను మినహాయింపు ఇవ్వాలని డిమాండ్ చేస్తున్నారు.