2023 కర్ణాటక అసెంబ్లీ ఎన్నికల్లో విజయం సాధించేందుకు బీజేపీ స‌ర్వ‌శ‌క్తులు ఒడ్డుతోంది. అందులో భాగంగానే ప్రధాని నరేంద్ర మోడీ బెంగళూరులో వరుసగా రెండవ రోజు రోడ్‌షో నిర్వహిస్తున్నారు. కెంపేగౌడ విగ్రహం నుంచి ట్రినిటీ సర్కిల్ వరకు రోడ్‌షో సాగనుంది. రోడ్‌షో సందర్భంగా ప్రజలు ప్రధాని మోదీపై పూల వర్షం కురిపించారు.

2023 కర్ణాటక అసెంబ్లీ ఎన్నికల్లో(Karnataka Assembly Elections) విజయం సాధించేందుకు బీజేపీ(BJP) స‌ర్వ‌శ‌క్తులు ఒడ్డుతోంది. అందులో భాగంగానే ప్రధాని నరేంద్ర మోడీ(Narendra Modi) బెంగళూరు(Bengalore)లో వరుసగా రెండవ రోజు రోడ్‌షో నిర్వహిస్తున్నారు. కెంపేగౌడ విగ్రహం నుంచి ట్రినిటీ సర్కిల్ వరకు రోడ్‌షో(Raod show) సాగనుంది. రోడ్‌షో సందర్భంగా ప్రజలు ప్రధాని మోదీపై పూల వర్షం కురిపించారు. రోడ్‌షో అనంతరం నాలుగు బహిరంగ సభల్లో కూడా ప్రసంగించనున్నారు. ప్రధాని మోదీ ర్యాలీకి భద్రతను కట్టుదిట్టం చేశారు. అంతకుముందు శనివారం నాడు ప్రధాని 26 కిలోమీటర్ల మేర రోడ్ షో నిర్వ‌హించారు. ప్రధాని మోదీ రోడ్‌షోకు పెద్ద సంఖ్యలో ప్రజలు తరలివచ్చారు. రోడ్‌షో విజ‌య‌వంతం చేసేందుకు నేత‌లు ముమ్మరంగా ఏర్పాట్లు చేశారు. కర్ణాటక అసెంబ్లీ ఎన్నికలకు మే 10న పోలింగ్(Polling) జరగనుంది. ఓట్ల లెక్కింపు(Vote Counting) మే 13న జరుగుతుంది. రాష్ట్రంలో ప్రస్తుతం బీజేపీ అధికారంలో ఉండగా బసవరాజ్ బొమ్మై(Basawaraj Bommai) ముఖ్యమంత్రిగా ఉన్నారు.

Updated On 7 May 2023 5:05 AM GMT
Yagnik

Yagnik

Next Story