ప్రధానమంత్రి నరేంద్ర మోదీ(Narendra Modi) బుధ‌వారం వీడియో కాన్ఫరెన్స్ ద్వారా రాజస్థాన్‌(Rajasthan)లో మొదటి వందే భారత్ ఎక్స్‌ప్రెస్ రైలు(Vande Bharat Express)ను జెండా ఊపి ప్రారంభించనున్నారు. వందే భారత్ ఎక్స్‌ప్రెస్ రాజస్థాన్‌లో ప్రారంభమై.. జైపూర్(Jaipur), ఢిల్లీ కాంట్ రైల్వేస్టేష‌న్ల‌(Delhi Cantonment railway station) మధ్య నడుస్తుంది. ఈ వందే భారత్ ఎక్స్‌ప్రెస్ రెగ్యులర్ సర్వీస్ ఏప్రిల్ 13 నుండి ప్రారంభమవుతుంది. ఈ ఎక్స్‌ప్రెస్ ట్రైన్‌ జైపూర్, అల్వార్, గురుగ్రామ్‌లలో స్టాప్‌లతో అజ్మీర్ ఢిల్లీ కాంట్ రైల్వేస్టేష‌న్ల‌ మధ్య […]

ప్రధానమంత్రి నరేంద్ర మోదీ(Narendra Modi) బుధ‌వారం వీడియో కాన్ఫరెన్స్ ద్వారా రాజస్థాన్‌(Rajasthan)లో మొదటి వందే భారత్ ఎక్స్‌ప్రెస్ రైలు(Vande Bharat Express)ను జెండా ఊపి ప్రారంభించనున్నారు. వందే భారత్ ఎక్స్‌ప్రెస్ రాజస్థాన్‌లో ప్రారంభమై.. జైపూర్(Jaipur), ఢిల్లీ కాంట్ రైల్వేస్టేష‌న్ల‌(Delhi Cantonment railway station) మధ్య నడుస్తుంది. ఈ వందే భారత్ ఎక్స్‌ప్రెస్ రెగ్యులర్ సర్వీస్ ఏప్రిల్ 13 నుండి ప్రారంభమవుతుంది. ఈ ఎక్స్‌ప్రెస్ ట్రైన్‌ జైపూర్, అల్వార్, గురుగ్రామ్‌లలో స్టాప్‌లతో అజ్మీర్ ఢిల్లీ కాంట్ రైల్వేస్టేష‌న్ల‌ మధ్య నడుస్తుంది.

ఈ వందే భారత్ ఎక్స్‌ప్రెస్ ద్వారా.. ఢిల్లీ(Delhi) నుంచి అజ్మీర్‌(Ajmer)కు అతిత‌క్కువ స‌మ‌యంలో చేరుకోవ‌చ్చు. ప్ర‌యాణ స‌మ‌యం కేవ‌లం 5 గంటల 15 నిమిషాలు మాత్ర‌మే. ప్రస్తుతం అదే మార్గంలో న‌డుస్తున్న‌ శతాబ్ది ఎక్స్‌ప్రెస్ కు 6 గంటల 15 నిమిషాలు పడుతుంది. కొత్త వందే భారత్ ఎక్స్‌ప్రెస్ ప్రస్తుతం ఉన్న శతాబ్ది ఎక్స్‌ప్రెస్ కంటే 60 నిమిషాలు ముందుగా చేరుకోగ‌ల‌దు. ఈ రైలు రాజస్థాన్‌లోని పుష్కర్(Pushkar), అజ్మీర్ షరీఫ్ దర్గాలతో సహా ప్రధాన పర్యాటక ప్రాంతాలకు కనెక్టివిటీని మెరుగుపరుచ‌నుంది. ఏడాది పొడవునా సందర్శకులకు సులువైన ప్ర‌యాణాన్ని అందించ‌నుంది. ఈ ప్రాంతంలో సామాజిక-ఆర్థిక అభివృద్ధికి కూడా ప్రోత్సాహాన్ని అందిస్తుందని భావిస్తున్నారు. వందే భారత్ ఎక్స్‌ప్రెస్ అనేది దేశీయంగా తయారు చేయబడిన సెమీ-హై స్పీడ్ రైలు. ఈ రైలు ప్రయాణీకులకు అత్యాధునిక సౌకర్యాలు, వేగవంతమైన, సౌకర్యవంతమైన ప్రయాణ అనుభవాన్ని అందిస్తుంది.

ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఏప్రిల్ 8న చెన్నై-కోయంబత్తూరు వందే భారత్ ఎక్స్‌ప్రెస్‌ను చెన్నైలో జెండా ఊపి ప్రారంభించారు. సికింద్రాబాద్ లో సికింద్రాబాద్-తిరుపతి వందే భారత్ ఎక్స్‌ప్రెస్(Secunderabad-Tirupati Vande Bharat Expres) ను కూడా ప్రారంభించారు. అంతకుముందు జనవరిలో సికింద్రాబాద్, విశాఖపట్నం మధ్య వందే భారత్ ఎక్స్‌ప్రెస్‌ను ప్రధాని మోదీ జెండా ఊపి ప్రారంభించారు. సికింద్రాబాద్-తిరుపతి వందే భారత్ ఎక్స్‌ప్రెస్ నల్గొండ, గుంటూరు, ఒంగోలు, నెల్లూరు స్టేషన్లలో ఆగుతుంది.

Updated On 11 April 2023 9:46 PM GMT
Yagnik

Yagnik

Next Story