ఆసియాలో అతిపెద్ద ఎయిర్ షో 2023 బెంగళూరులో అట్టహాసంగా ప్రారంభమైంది. బెంగళూరు వేదికగా ‘ద రన్‌ వే టు ఏ బిలియన్‌ ఆపర్చునిటీస్‌’ పేరిట నిర్వహిస్తున్న ఈ ప్రదర్శన ఇవాళ్టి నుంచి ఐదు రోజుల పాటు జరగనుంది. రికార్డు స్థాయిలో 98 దేశాలు ఈ ప్రదర్శనలో పాల్గొంటున్నాయి. 809 రక్షణ, వైమానిక రంగ ప్రదర్శనకారులు తమ విన్యాసాలను ప్రదర్శించనున్నారు. ఈ ఎయిర్‌షోలో భాగంగా భారత్‌, విదేశీ రక్షణ కంపెనీల మధ్య రూ.75వేల కోట్ల విలువైన 251 ఒప్పందాలు […]

ఆసియాలో అతిపెద్ద ఎయిర్ షో 2023 బెంగళూరులో అట్టహాసంగా ప్రారంభమైంది. బెంగళూరు వేదికగా ‘ద రన్‌ వే టు ఏ బిలియన్‌ ఆపర్చునిటీస్‌’ పేరిట నిర్వహిస్తున్న ఈ ప్రదర్శన ఇవాళ్టి నుంచి ఐదు రోజుల పాటు జరగనుంది. రికార్డు స్థాయిలో 98 దేశాలు ఈ ప్రదర్శనలో పాల్గొంటున్నాయి. 809 రక్షణ, వైమానిక రంగ ప్రదర్శనకారులు తమ విన్యాసాలను ప్రదర్శించనున్నారు. ఈ ఎయిర్‌షోలో భాగంగా భారత్‌, విదేశీ రక్షణ కంపెనీల మధ్య రూ.75వేల కోట్ల విలువైన 251 ఒప్పందాలు జరగనున్నట్టు ఇప్పటికే ప్రభుత్వం ప్రకటించింది.

ఐదు రోజుల పాటు అనగా ఈ నెల 17వ తేదీ వరకు హలహంక వైమానిక స్థావరంలో దేశవిదేశాలకు చెందిన యుద్ధ, పౌర విమానాలు, హెలికాప్టర్లు కొలువుదీరబోతున్నాయి. ఇది ఆసియాలోనే అతిపెద్ద ఎయిర్ షో కార్యక్రమం కావటం విశేషం. ఈ కార్యక్రమంలో ప్రపంచం నలుమూలలకు చెందిన దాదాపు 809 కంపెనీలు పాల్గొంటున్నాయి.

రక్షణశాఖ ఆధ్వర్యంలో ప్రతి రెండేళ్లకు ఒకసారి నిర్వహించే ఏరో ఇండియా కార్యక్రమం కరోనా కారణంగా 2021లో జరిగిన వైమానిక ప్రదర్శనకు సందర్శకులను అనుమతించలేదు. కరోనా తర్వాత భారీ ఎత్తున నిర్వహిస్తున్న ఏరో ఇండియా షోకు జనం భారీగా తరలివచ్చారు. 16, 17వ తేదీల్లో ప్రదర్శనకు సాధారణ సందర్శకులను అనుమతిస్తారు. విమానాల విన్యాసాలు ప్రతి రోజు ఉదయం 10 గంటలకు, హధ్యా‌హ్నం 2 గంటలకు రోజుకు రెండుసార్లు జరుగనున్నాయి.

ఈ ప్రదర్శనలో పలు దేశాలకు చెందిన వైమానిక సంస్థలు, వాయుసేన విమానాలు పాల్గొననున్నాయి. దీంతో హెలికాప్టర్లు, విమానాలు, రక్షణ రంగ పరికరాల తయారీ కంపెనీలు తరలివచ్చాయి. ఈ ఐదు రోజులపాటు సమావేశాలు, విమానాల కొనుగోలు ఒప్పందాలు జరుగనున్నాయి. సందర్శకుల కోసం పుడ‌ కోర్టులను ఏర్పాటు చేయడంతోపాటు విమాన ప్రదర్శన జరిగే యలహంకకు ప్రత్యేక బస్సులు కూడా నడుపుతున్నారు.

ఏరో ఇండియా ప్రదర్శన ఎన్నో అవకాశాలకు రన్‌వేగా నిలుస్తుందని ప్రధాని నరేంద్ర మోడీ అన్నారు. ‘‘నవ భారత సామర్థ్యాలను చాటి చెప్పేందుకు బెంగళూరు గగనతలం వేదికగా మారిందని చెప్పారు. ఏరో ఇండియా మన బలాన్ని, సామర్థ్యాన్ని ప్రతిబింబిస్తోంది. ఇది కేవలం ప్రదర్శన మాత్రమే కాదు.. మన ఆత్మవిశ్వాసానికి ప్రతీక అన్నారు. ఇప్పుడు విదేశీ రక్షణ రంగ ఉత్పత్తులకు భారత్ కేవలం మార్కెట్‌ మాత్రమే కాదు.. ఎన్నో దేశాలకు బలమైన రక్షణ భాగస్వామిగా మారిందని అన్నారు ప్రపంచంలోనే అతిపెద్ద రక్షణ రంగ ఎగుమతిదారుగా ఎదిగే దిశగా భారత్‌ ముందడుగు వేస్తోంది’ అని ప్రధాని మోడీ చెప్పారు

ఆ తర్వాత పలు విమానాల విన్యాసాలను ప్రధాని మోడీ తిలకించారు. ఈ కార్యక్రమంలో కేంద్ర రక్షణమంత్రి రాజ్‌నాథ్‌ సింగ్‌, కర్ణాటక ముఖ్యమంత్రి బసవరాజు బొమ్మై, ఎయిర్ చీఫ్ మార్షల్ వీఆర్ చౌధరి కూడా పాల్గొన్నారు.

2019 ఏరో ఇండియాలో రెండు సూర్యకిరణ్‌ విమానాలు ఆకాశంలో ఢీకొట్టుకుని కూలిపోగా పైలట్లు గాయపడ్డారు. మరుసటిరోజు పార్కింగ్‌ ప్రదేశంలో మంటలు చెలరేగి వందకు పైగా కార్లు బూడిదగా మారాయి. ఈసారి అటువంటి విపత్తులు సంభవించకుండా పకడ్బందీ ఏర్పాట్లు చేసినట్లు అధికారులు తెలిపారు.

Updated On 6 April 2023 2:15 AM GMT
Ehatv

Ehatv

Next Story