జపాన్‌లో జరిగిన జీ-7, క్వాడ్ సమావేశాల్లో పాల్గొన్న అనంతరం ప్రధాని నరేంద్ర మోదీ ఆదివారం పపువా న్యూ గినియా చేరుకున్నారు. ఫోరమ్ ఫర్ ఇండియా-పసిఫిక్ ఐలాండ్స్ కో-ఆపరేషన్ (FIPIC) యొక్క 3వ శిఖరాగ్ర సమావేశానికి హాజరయ్యేందుకు ప్రధాని నరేంద్ర మోదీ పపువా న్యూ గినియా వెళ్లారు.
జపాన్(Japan)లో జరిగిన జీ-7, క్వాడ్ సమావేశాల్లో పాల్గొన్న అనంతరం ప్రధాని నరేంద్ర మోదీ(PM Narendra Modi) ఆదివారం పపువా న్యూ గినియా(Papua New Guinea) చేరుకున్నారు. ఫోరమ్ ఫర్ ఇండియా-పసిఫిక్ ఐలాండ్స్ కో-ఆపరేషన్ (FIPIC) యొక్క 3వ శిఖరాగ్ర సమావేశానికి హాజరయ్యేందుకు ప్రధాని నరేంద్ర మోదీ పపువా న్యూ గినియా వెళ్లారు. ముందుగా ఏపీఈసీ హౌస్‌కి చేరుకున్న ప్రధాని మోదీకి పాపువా న్యూ గినియా ప్రధాని జేమ్స్ మరాపే(James Marape) స్వాగతం పలికారు. ప్రధాని మోదీ గవర్నర్ జనరల్ సర్ బాబ్ డేడ్‌ను కూడా కలిశారు. ఈ సందర్భంగా ఇరువురు నేతలు భారత్-పాపువా న్యూ గినియా సంబంధాల మధ్య అభివృద్ధి, భాగస్వామ్యం గురించి చర్చించారు. పసిఫిక్ ప్రాంతంలోని దేశాలతో సంబంధాలపై భారత్ దృష్టి సారించిన.. ప్రధాని మోదీ స్వయంగా పలువురు దేశాధినేతలను కలిశారు.
పాపువా న్యూ గినియాలో 'తిరుక్కురల్' పుస్తకానికి టోక్ పిసిన్ అనువాదాన్ని ప్రధాని నరేంద్ర మోదీ విడుదల చేశారు. ఎఫ్ఐపీఎఫ్‌సీ సమ్మిట్‌లో భాగంగా సోలమన్ దీవుల ప్రధాన మంత్రి మనస్సే సొగవారే(Manasseh Sogavare)తో కూడా ప్రధాని సమావేశమయ్యారు. పపువా న్యూ గినియాలో, ద్వైపాక్షిక సంబంధాలను పెంపొందించే మార్గాలపై సమోవా ప్రధాని ఫియామే నవోమి మతాఫాతో ప్రధాని మోదీ చర్చించారు. జపాన్(Japan) నుంచి పాపువా న్యూ గినియా వరకు చర్చలు జరుగుతున్నాయని ప్రధాని నరేంద్ర మోదీ ట్వీట్ చేశారు. కుక్ దీవుల ప్రధానమంత్రి మార్క్ బ్రౌన్(Mark Brown)ని సమావేశంలో చూడడం ఆనందంగా ఉందన్నారు. అలాగే.. పాపువా న్యూ గినియాలో పీఐఎఫ్ (పసిఫిక్ ఐలాండ్స్ ఫోరమ్) సెక్రటరీ జనరల్ హెన్రీ పునా(Henry Puna)తో ప్రధాని నరేంద్ర మోదీ భేటీ అయ్యారు. రిపబ్లిక్ ఆఫ్ కిరిబాటి అధ్యక్షుడు తానేటి మమౌతో తాను అద్భుతంగా సంభాషించానని ప్రధాని నరేంద్ర మోదీ అన్నారు. ఇరు దేశాల మధ్య సంబంధాలను పెంపొందించుకునే ఉద్దేశంతో వివిధ అంశాలపై చర్చించాం అని ప్రధాన మంత్రి అన్నారు. రిపబ్లిక్ ఆఫ్ మార్షల్ ఐలాండ్స్ మంత్రి కిట్లాంగ్ కబువాతో కూడా ప్రధాని మోదీ సమావేశమయ్యారు.