కేరళ పర్యటనలో ఉన్న ప్రధానమంత్రి నరేంద్రమోదీ కొచ్చిలో వాటర్ మెట్రోను ప్రారంభించారు. తిరువనంతపురం నుంచి ఆన్‌లైన్లో ఈ సర్వీసును ఆయన ప్రారంభించారు. ఏమిటీ వాటర్ మెట్రో ప్రత్యేకత? కేరళ బ్యాక్ వాటర్స్‌ను సందర్శించకుండా ఉండలేరు. ఆ బ్యాక్ వాటర్స్‌లో బోటు షికారు తీపి జ్ఞాపకంగా మిగిలిపోతుంది. ఆ బ్యాక్ వాటర్స్‌ను మరింత సద్వినియోగం చేసుకోవడానికి వాటర్ మెట్రోను తీసుకొచ్చారు. మెట్రో రైళ్లు పట్టాల మీద నడుస్తాయి.
కేరళ పర్యటనలో ఉన్న ప్రధానమంత్రి నరేంద్రమోదీ కొచ్చిలో వాటర్ మెట్రోను ప్రారంభించారు. తిరువనంతపురం నుంచి ఆన్‌లైన్లో ఈ సర్వీసును ఆయన ప్రారంభించారు. ఏమిటీ వాటర్ మెట్రో ప్రత్యేకత? కేరళ బ్యాక్ వాటర్స్‌ను సందర్శించకుండా ఉండలేరు. ఆ బ్యాక్ వాటర్స్‌లో బోటు షికారు తీపి జ్ఞాపకంగా మిగిలిపోతుంది. ఆ బ్యాక్ వాటర్స్‌ను మరింత సద్వినియోగం చేసుకోవడానికి వాటర్ మెట్రోను తీసుకొచ్చారు. మెట్రో రైళ్లు పట్టాల మీద నడుస్తాయి. కానీ ఈ వాటర్ మెట్రో మాత్రం నీళ్లపై నడుస్తాయి. రేపట్నుంచి ప్రయాణికులకు అందుబాటులోకి వచ్చే వాటర్ మెట్రో కోసం ప్రజలు ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. కొచ్చి వాటర్ మెట్రో, జర్మనీకి చెందిన కె.ఎఫ్.డబ్ల్యూ సంస్థలు సంయుక్తంగా ఈ వాటర్ మెట్రోను అందుబాటులోకి తెచ్చాయి. 1,137 కోట్ల రూపాయలను వెచ్చించి 78 ఎలక్ట్రిక్ బోట్లను అందుబాటులోకి తీసుకురావాలనుకుంటున్నారు. కొచ్చితో పాటు చుటుపక్కల ఉన్న పది చిన్న దీవులను వాటర్ మెట్రో కలుపుతుంది. చాలా సమయం ఆదా అవుతుంది.
అంటే హైకోర్టు టెర్మినల్ నుంచి వైపిన్ టెర్మినల్‌కు జస్ట్ 20 నిమిషాల్లో చేరుకోవచ్చు. టికెట్ రేటు కూడా 20 రూపాయలే. వైటిల్లా నుంచి కక్కనాడ్‌కు 30 రూపాయలు ఛార్జ్ చేస్తున్నారు. ట్రాఫిక్ సమస్యలు ఉండవు. వాయు కాలుష్యం బెడద అసలే ఉండదు. చక్కగా ప్రకృతి ఎంజాయ్ చేస్తూ నీటి మీద ప్రయాణించవచ్చు. వాటర్ మెట్రో కోసం జర్మన్ టెక్నాలజీతో తయారైన అత్యాధునిక బోట్లను అందుబాటులోకి తీసుకొచ్చారు. ఇవన్నీ పర్యావరణానికి అనుకూలమైనవే! ఎలాంటి కాలుష్యమూ ఉండదు. ఈ బోట్లు లీథియం టెటైనైట్ స్పిన్నెల్ బ్యాటరీస్ సాయంతో నడుస్తాయి. దివ్యాంగులు ప్రయాణించడానికి అనుకూలంగా ఈ బోట్లను తయారు చేశారు. టెర్మినల్స్‌లో కూడా ఎలాంటి ఇబ్బంది ఉండకుండా చూసుకున్నారు. ఇప్పుడైతే ఉదయం ఏడు గంటల నుంచి రాత్రి ఎనిమిది గంటల వరకు వాటర్ మెట్రో అందుబాటులో ఉంటుంది. 15 మెట్రో బోట్లను ఎనిమిది రూట్లలో తిప్పుతున్నారు. ప్రతి 15 నిమిషాలకోసారి మెట్రో బోటు వస్తుంది. రోజూ ప్రయాణించేవారి కోసం వీక్లీ, మంత్లి పాస్‌లు కూడా అందుబాటులోకి తీసుకొచ్చారు. అమ్మల కోసం ప్రతీ బోటులో ఫీడింగ్ గదిని ఏర్పాటు చేశారు. పూర్తిగా ఎయిర్ కండీషన్. వాటర్ మెట్రోలో వంద మంది ప్రయాణించవచ్చు.