‘మేకిన్ ఇండియా’లానే ‘వెడ్ ఇన్ ఇండియా’(wed in india) ఉద్యమాన్ని ప్రారంభించాలని యువ జంటలకు ప్రధాని నరేంద్రమోదీ విజ్ఞప్తి చేశారు. యువ జంటలు ఉత్తరాఖండ్‌లో డెస్టినేషన్ వెడ్డింగ్ చేసుకోవాలని సూచించారు. అయితే ఈ రోజుల్లో డెస్టినేషన్ వెడ్డింగ్ పేరుతో విదేశాల్లో పెళ్లి చేసుకోవడం ఫ్యాషన్ అయిపోయిందన్న ప్రధాని ఆందోళన వ్యక్తం చేశారు.
‘వెడ్ ఇన్ ఇండియా’ ఉద్యమానికి ప్రధాని మోదీ పిలుపునిచ్చారు. ఉత్తరాఖండ్‌ను డెస్టినేషన్ వెడ్డింగ్ హబ్‌గా మార్చాలని..కుటుంబంలో కనీసం ఒక్కరైనా తమ పెళ్లిని ఉత్తరాఖండ్‌లో జరుపుకోవాలన్న మోదీ కోరారు. ఉత్తరాఖండ్ రాజధాని డెహ్రాడూన్‌లో రెండు రోజులపాటు జరగనున్న గ్లోబల్ ఇన్వెస్టర్స్ సమ్మిట్ 2023 ప్రారంభోత్సవం సందర్భంగా ప్రధాని మోదీ ఈ కీలక వ్యాఖ్యలు చేశారు.
‘మేకిన్ ఇండియా’లానే ‘వెడ్ ఇన్ ఇండియా’(wed in india) ఉద్యమాన్ని ప్రారంభించాలని యువ జంటలకు ప్రధాని నరేంద్రమోదీ విజ్ఞప్తి చేశారు. యువ జంటలు ఉత్తరాఖండ్‌లో డెస్టినేషన్ వెడ్డింగ్ చేసుకోవాలని సూచించారు. అయితే ఈ రోజుల్లో డెస్టినేషన్ వెడ్డింగ్ పేరుతో విదేశాల్లో పెళ్లి చేసుకోవడం ఫ్యాషన్ అయిపోయిందన్న ప్రధాని ఆందోళన వ్యక్తం చేశారు. ‘‘పెళ్లి చేసుకునే జంటలను దేవుడు కలుపుతాడని భారతీయులు విశ్వసిస్తారు. దేవుడు కలిపే జంటలు దేవుడి పాదాల చెంత కాకుండా విదేశాల్లో ఒక్కటి కావడం ఏంటని ప్రశ్నించారు. ఇప్పటికైనా యువ జంటలు డెస్టినేషన్ వెడ్డింగ్ గురించి ఆలోచించాలి’’ అని మోడీ సూచించారు. వెడ్ ఇన్ ఇండియా ద్వారా దేశంలో వివాహాల ఉద్యమం రావాలని ఆకాంక్షించారు.
భారతదేశంలోని సంపన్నులు తమ దేశంలో పెళ్లిళ్లు చేసుకోవడానికి చిన్నచూపు చూస్తున్నారని అసంతృప్తి వ్యక్తం చేశారు ప్రధాని నరేంద్ర మోదీ. అందుకే చాలా మంది సంపన్నులు విదేశాలకు పరుగులు తీస్తున్నారని, ఇతర దేశాల్లో పెళ్లాడటం ఫ్యాషన్ అయిపోయిందని ప్రధాని విమర్శించారు. రాబోయే ఐదేళ్లలో ప్రతి కుటుంబంలో ఒక్కరైనా తమ డెస్టినేషన్ వెడ్డింగ్‌ను దేవభూమి ఉత్తరాఖండ్‌లో జరుపుకోవాలని..అప్పుడది ప్రపంచంలోనే అతిపెద్ద వెడ్డింగ్ డెస్టినేషన్ అవుతుందని అన్నారు. ఈ సంప్రదాయాన్ని దేశంలోని సంపన్నులైన పారిశ్రామిక కుటుంబాలవారు ప్రారంభించాలని కోరారు. ప్రతి ఏడాది ఇక్కడ 5 వేల వివాహాలు జరిగితే మౌలిక వసతులు వాటంతటవే అందుబాటులోకి వస్తాయన్నారు. మనం తలచుకుంటే అదేమంత పెద్ద విషయం కాదని ప్రధాని వివరించారు.
దేశంలోని ప్రముఖ ప్రదేశాల్లో వివాహాలు జరిగితే ఆర్థిక వ్యవస్థకు బలం చేకూరుతుంది’’ అని ప్రధాని మోదీ అభిప్రాయపడ్డారు. ఇక వచ్చే పార్లమెంట్ ఎన్నికల్లో బీజేపీ విజయం సాధించడం ఖాయమని అన్నారు. మూడోసారి ప్రధాని పదవిని చేపడతానని మోడీ ధీమా వ్యక్తం చేశారు.