దేశవ్యాప్తంగా 77వ స్వాతంత్య్ర దినోత్సవ వేడుకలు ఘనంగా జరుగుతున్నాయి. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఎర్రకోటపై జాతీయ జెండాను ఎగరేశారు. అంతకుముందు ప్రధాని ఎర్రకోట దగ్గర త్రివిధ దళాల నుంచి గార్డ్ ఆఫ్ హానర్ స్వీకరించారు.

PM Modi hoists National Flag at Red Fort
దేశవ్యాప్తంగా 77వ స్వాతంత్య్ర దినోత్సవ వేడుకలు(Independenceday Celebrations) ఘనంగా జరుగుతున్నాయి. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ(PM Modi) ఎర్రకోట(Red Port)పై జాతీయ జెండా(National Flag)ను ఎగరేశారు. అంతకుముందు ప్రధాని ఎర్రకోట దగ్గర త్రివిధ దళాల నుంచి గార్డ్ ఆఫ్ హానర్ స్వీకరించారు. రాజ్‌ఘాట్(Raj Ghat)లో జాతిపిత మహాత్మా గాంధీ(Mahatma Gandhi) సమాధి దగ్గర ప్రధాని మోదీ నివాళులు అర్పించారు.
అనంతరం ప్రధాని మోదీ మాట్లాడుతూ.. స్వాతంత్య్ర దినోత్సవం సందర్భంగా దేశప్రజలకు శుభాకాంక్షలు తెలిపారు. ప్రపంచంలో భారత్ అతి పెద్ద ప్రజాస్వామ్య దేశమని.. విశ్వంలో నంబర్ వన్‌గా ఉన్నామన్నారు. ఎందరో త్యాగాల ఫలితంగా స్వాతంత్య్రం వచ్చిందన్నారు. అమరుల త్యాగాలకు ధన్యవాదాలు తెలిపారు. దేశంలో ఎన్నో సమస్యలున్నా.. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు కలిసి సమస్యల్ని పరిష్కరించుకుంటూ ముందుకెళ్తున్నామన్నారు. మణిపూర్‌లో హింసపై మాట్లాడుతూ.. హింస కారణంగా కొంతమంది జీవితాలు ఛిన్నాభిన్నం అయ్యాయని అన్నారు. మణిపూర్ ప్రజలతో ఈ దేశం ఉందన్నారు. కొన్ని రోజులుగా శాంతి కనిపిస్తోందని.. శాంతితోనే సమాధానం లభిస్తుందన్నారు.
