సెప్టెంబర్ 18 నుంచి పార్లమెంట్ ప్రత్యేక సమావేశాలు(Parliament special Meeting) ప్రారంభం కానున్నాయి. సెప్టెంబర్ 22 వరకు ఈ సమావేశాలు జరగనున్నాయి. ఐదు రోజులు ఈ ప్రత్యేక సమావేశాలు జరగనున్నాయని కేంద్ర మంత్రి ప్రహ్లాద్ జోషి గురువారం వెల్లడించారు. సెప్టెంబర్ 18 నుంచి 22 మధ్య ఐదు రోజుల పాటు పార్లమెంట్ ప్రత్యేక సమావేశాలను నిర్వహించనున్నట్లు పార్లమెంటరీ వ్యవహారాల మంత్రి ప్రహ్లాద్ జోషి(Prahladh Joshi) గురువారం తెలిపారు. ‘అమృత్‌కాల్’ సందర్భంగా సభలో అర్థవంతమైన చర్చ జరుగుతుందని ఆశాభావం వ్యక్తం చేశారు.

సెప్టెంబర్ 9, 10 తేదీల్లో దేశ రాజధాని ఢిల్లీలో(Delhi) జీ20(G20) సదస్సు జరగనుంది. కొద్దిరోజుల తర్వాత పార్లమెంటు ప్రత్యేక సమావేశాలు జరగనున్నాయి. ప్రత్యేక సమావేశాల ఎజెండా ఏమిటనే దానిపై ఇంకా అధికారిక ప్రకటన రాలేదు. మణిపూర్ హింసాకాండపై పార్లమెంటు వర్షాకాల సమావేశాలలో గందరగోళం నెలకొన్న విషయం తెలిసిందే. విపక్ష సభ్యులు లోక్‌సభ, రాజ్యసభలో గందరగోళం సృష్టించడంతో పలుమార్లు సభా కార్యకలాపాలకు అంతరాయం కలిగింది.
సాధారణంగా పార్లమెంటులో మూడు రకాల సమావేశాలు ఉంటాయి. బడ్జెట్ సెషన్(Budget Session), వర్షాకాల సమావేశాలు, శీతాకాల సమావేశాలు. ప్రత్యేక పరిస్థితుల్లో పార్లమెంటు ప్రత్యేక సమావేశాలు నిర్వహించవచ్చనే నిబంధన కూడా ఉంది. లోక్ సభ ఎన్నికలకు సమయం దగ్గరపుడుతున్న వేళ.. కేంద్రం ప్రత్యేక సమావేశాలకు పిలవడానికి గల కారణాలు ఏంటన్నది అంతు చిక్కడం లేదు.