కొంత మంది సెలబ్రిటీలు తాము చేసే పనుల వల్ల ఒక్కో సారి ప్రమాదంలో పడుతుంటారు. అనవసరంగా సమస్యల్లో చిక్కుంటుంటారు. కాని అందులో ఇరుక్కున్న తరువాత కాని అసలు విషయం తెలియదు. తాజాగా ఓ స్టార్ కమెడియన్ పరిస్థితి అలానే తయారయ్యింది. ముఖ్యంగా సెలబ్రిటీలు ఏమౌతుందిలే... మనం అందరికి తెలసు కదా అని.. దైర్యంగా.. ఏదైనా వెళ్లకూడని ప్రదేశాలకు వెళ్లినా.. ఎక్కడైనా నోరు జారినా సోషల్ మీడియాలో అది పెద్ద రచ్చే అవుతుంది. రీసెంట్ గా అలాంటి పనే చేశాడు.

కొంత మంది సెలబ్రిటీలు తాము చేసే పనుల వల్ల ఒక్కో సారి ప్రమాదంలో పడుతుంటారు. అనవసరంగా సమస్యల్లో చిక్కుంటుంటారు. కాని అందులో ఇరుక్కున్న తరువాత కాని అసలు విషయం తెలియదు. తాజాగా ఓ స్టార్ కమెడియన్ పరిస్థితి అలానే తయారయ్యింది.

సోషల్ మీడియా(Social Media) వచ్చిన తరువాత సెలబ్రిటీలు ఏం చేసినా.. జనాలకు ఇట్టే తెలిసిపోతుంది. అందులో ఏదైనా పొరపాటు ఉన్నా.. అదికూడా వైరల్ అవుతుంది. దాంతో స్టార్స్ ట్రోల్ అవ్వడమో.. లేదా కేసులు, నోటీసులు వెళ్లడమో.. వాళ్ళు చేసే పనినిబట్టి ఉంటుంది. దీని వల్ల సినిమా వాళ్లే కాదు.. పాలిటిక్స్.. ప్లేయర్స్.. ఇలా అన్నిరంగాల వాళ్లు ఎఫెక్ట్ అవుతుంటారు. రాజకీయ నేతలు, క్రీడా రంగానికి చెందిన వారు చేసే చిన్న పొరపాటు తీవ్ర పరిణామాలు ఎదుర్కొవాల్సి వస్తుంది.

ముఖ్యంగా సెలబ్రిటీలు ఏమౌతుందిలే... మనం అందరికి తెలసు కదా అని.. దైర్యంగా.. ఏదైనా వెళ్లకూడని ప్రదేశాలకు వెళ్లినా.. ఎక్కడైనా నోరు జారినా సోషల్ మీడియాలో అది పెద్ద రచ్చే అవుతుంది. రీసెంట్ గా అలాంటి పనే చేశాడు. ప్రముఖ కమెడియన్, మిమిక్రి ఆర్టిస్ట్ శ్యామ్ రంగీల. ఇతను చేసిన పనికి జైపూర్ అటవీ శాఖ అధికారులు నోటీసులు కూడా జారీ చేశారు.

ప్రముఖ మిమిక్రీ ఆర్టిస్ట్, హాస్య నటుడు శ్యామ్ రంగీలా(Shyam Rangeela) జైపూర్(Jaipur)లోని ఝలానా చిరుతపులి రిజర్వ్(Jhalana Leopard Reserve) లో నీల్‌గాయ్‌(Neelgaay)కు కు ఆహారం తినిపిస్తున్న ఓ వీడియో సోషల్ మీడియాలో వైరల్ అయ్యింది. అయితే అతను ఈ పని చేసేప్పుడు ప్రధాని నరేంద్ర మోదీ.. రీసెంట్ గా నీల్‌గాయ్‌కు కి ఫుడ్ తినిపించడం చేశారు.. అప్పుడు ప్రధాని ఏ డ్రస్ అయితే వేసుకున్నాడో.. మనోడు కూడా అదే డ్రస్ లో కనిపించాడు. అయితే ఈ వీడియోలు కాస్తా.. అతన తన పేజ్ లో పెట్టడం.. అవి వైరల్ అయ్యాయి.

కర్ణాటకలోని బందీపూర్ టైగర్ రిజర్వ్ లో ఇటీవల జంగిల్ సఫారీ సందర్భంగా ప్రధాన మంత్రి మోదీ కాస్త కొత్తగా కనిపించాడు. ఇంతకు ముందు ఎప్పుడూ లేని విధంగా డ్రెస్ వేసుకుని.. డిఫరెంట్ లుక్ లో కనిపించారు. ఈ గెటప్ లో మోదీకి సంబంధించిన ఫోటోలు, వీడియోలు బాగా వైరల్ అయ్యాయి. అయితే మన కమెడియన్ శ్యామ్ కూడా అచ్యం ప్రధానమంత్రి వేసుకున్న డ్రస్ ను వేసుకుని కనిపించాడు.

అయితే ఇక్కడ అతను చేసిన పొరపాటు ఏంటంటే.. అతను జంతువులకు ఆహారం పెట్టడం. మోదీ ఏదో అలా పెట్టడేమో.. లేదా ఫోటో దిగారేమో కాని.. శ్యామ్ రంగీలా.. మాత్రం జైపూర్ లో ఝలానా లో జంగిల్ సఫారీలో నీల్ గాయ్కు ఆహారం తినిపించడం వన్యప్రాణి సంరక్షణ చట్టం కింద నిబంధనలను ఉల్లంఘించినట్లు లెక్క. ఈ క్రమంలో జైపూర్ అటవీశాఖ వారు కమెడియన్ శ్యామ్ రంగీలాకు నోటీసులు పంపించారు. తాను యూట్యూబ్ లో ఈ వీడియో పెట్టడంతోనే అసలే ఇబ్బంది వచ్చి పడింది.

ఇక అసలు వియం ఏంటంటే.. అడవిలో ఉండే వన్యప్రాణులకు ఆహారం తినిపించడం అటవీ చట్టం 1953, వన్యప్రాణుల రక్షణ చట్టం 1972 ప్రకారం నేరం అడవిలో పెరిగే జంతులకు ఆహారం ఇవ్వడం వల్ల అవి మన వల్ల ఏవైనా వ్యాధుల భారిన పడితే.. ఇతర జంతువులకు ప్రమాదం వాటిల్లే అవకాశం ఉంటుందిన అధికారులు అంటున్నారు. ఇప్పటికే ఝలానా అటవీ ప్రాంతంలో జంతువులకు ఎలాంటి ఆహారం ఇవ్వకూడదు అని బోర్డులు కూడా ఏర్పాటు చేశామన్నారు అధికారుల.

అంతేకాదు శ్యామ్ రంగీలా తాను చేసింది ఏదో గొప్ప పని అయినట్లు దాన్ని వీడియో తీసి సోషల్ మీడియాలో అప్ లోడ్ చేయడం ఇతరులను నేరపూరిత చర్యలకు ప్రేరేపించడమే అవుతుందని అటవీ శాఖ అధికారి తెలిపారు.

Updated On 19 April 2023 4:43 AM GMT
Ehatv

Ehatv

Next Story