రెండు రోజుల పర్యటన నిమిత్తం ప్రధానమంత్రి నరేంద్రమోదీ కేరళకు చేరుకున్నారు. ప‌ర్య‌ట‌న‌లో భాగంగా మంగళవారం ఉదయం 11:10 గంటలకు తిరువనంతపురం, కాసర్‌గోడ్ మధ్య న‌డ‌వ‌నున్న‌ కేర‌ళ‌ మొట్టమొదటి వందేభారత్ రైలును తిరువనంతపురం సెంట్రల్ స్టేషన్ నుండి జెండా ఊపి ప్రారంభించారు.

రెండు రోజుల పర్యటన నిమిత్తం ప్రధానమంత్రి నరేంద్రమోదీ(PM Narendra Modi) కేరళ(Kerala)కు చేరుకున్నారు. ప‌ర్య‌ట‌న‌లో భాగంగా మంగళవారం ఉదయం 11:10 గంటలకు తిరువనంతపురం(Thiruvananthapuram), కాసర్‌గోడ్(Kasargod) మధ్య న‌డ‌వ‌నున్న‌ కేర‌ళ‌ మొట్టమొదటి వందేభారత్ రైలును తిరువనంతపురం సెంట్రల్ స్టేషన్ నుండి జెండా ఊపి ప్రారంభించారు. ప్రధానమంత్రి కార్యాలయం(PMO) ప్రకారం.. ఈ రైలు ఏకంగా 11 జిల్లాలు క‌వ‌ర్ చేయ‌నుంది. తిరువనంతపురం, కొల్లాం(Kollam), కొట్టాయం(Kottayam), ఎర్నాకులం(Earnakulam), త్రిసూర్(Thrissur, పాలక్కాడ్(Palakkad), పతనంతిట్ట(Pathanamthitta), మలప్పురం(Malappuram), కోజికోడ్(Kozhikode), కన్నూర్(Kannur), కాసర్‌గోడ్‌లను మీదుగా న‌డ‌వ‌నున్న‌ట్లు పేర్కొంది.

మంగళవారం ఉదయం తిరువనంతపురం చేరుకున్న ప్రధానికి ఘనస్వాగతం లభించింది. అనంతరం సెంట్రల్ రైల్వే స్టేషన్‌(Central Railway Station)కు బయలుదేరారు. వందే భారత్ ఎక్స్‌ప్రెస్‌(Vande Bharat train)ను ప్రారంభించ‌డానికి ముందు.. ప్ర‌ధాని రైలులోని ఒక కోచ్‌లో పాఠశాల విద్యార్థులతో సంభాషించారు. ఆ స‌మ‌యంలో కేరళ గవర్నర్ ఆరిఫ్ మహమ్మద్ ఖాన్(Arif Mohammed Khan, ముఖ్యమంత్రి పినరయి విజయన్(Pinarayi Vijayan), కాంగ్రెస్ ఎంపీ శశి థరూర్(Shashi Tharoor) ప్రధాని వెంట ఉన్నారు. చిన్నారులు మోదీ పెయింటింగ్స్‌, స్కెచ్‌లు, తాము రూపొందించిన వందే భారత్‌ రైలును ప్ర‌ధానికి చూపించారు. ప్రధానమంత్రి ప‌ర్య‌ట‌న నేప‌థ్యంలో రాష్ట్ర రాజధాని మొత్తం గట్టి భద్రతా వలయంలో ఉంది.

Updated On 25 April 2023 1:20 AM GMT
Yagnik

Yagnik

Next Story