ప్రధానమంత్రి నరేంద్రమోదీ(PM Modi) ఎన్నికల ప్రచారం(Election Campaign)లో బీజీగా ఉంటున్నారు. మూడోసారి ఎన్డీయే అధికారంలోకి రావడం పక్కా అంటూనే కాలికి బలపం కట్టుకుని మరీ తిరుగుతున్నారు మోదీ! ముఖ్యంగా దక్షిణాదిపై ఆయన దృష్టి పెట్టారు. నాలుగొందల కంటే ఎక్కువ సీట్లు గెల్చుకుంటున్నామని చెబుతూ వస్తున్న నరేంద్రమోదీ
ప్రధానమంత్రి నరేంద్రమోదీ(PM Modi) ఎన్నికల ప్రచారం(Election Campaign)లో బీజీగా ఉంటున్నారు. మూడోసారి ఎన్డీయే అధికారంలోకి రావడం పక్కా అంటూనే కాలికి బలపం కట్టుకుని మరీ తిరుగుతున్నారు మోదీ! ముఖ్యంగా దక్షిణాదిపై ఆయన దృష్టి పెట్టారు. నాలుగొందల కంటే ఎక్కువ సీట్లు గెల్చుకుంటున్నామని చెబుతూ వస్తున్న నరేంద్రమోదీ ఈ పదేళ్ల కాలంలో తాము సాధించిన ఘనతలు చెప్పుకోకుండా ఇంకా కాంగ్రెస్ పార్టీ(Congress Party)నే విమర్శిస్తుండటమే విచిత్రం. ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ కాకరకాయ వంటిందని మోదీ అన్నారు. కాకరకాయను నేతిలో వేయించినా, చక్కెరతో కలిపి వండినా దాని రుచి మాదరట! అందుకే కాంగ్రెస్ పార్టీని కాకరకాయతో పోల్చానని మోదీ చెప్పుకొచ్చారు. తెలిసి అన్నారో తెలియక అన్నారో కానీ కాకరకాయతో కాంగ్రెస్‌ను పోల్చి మంచి పని చేశారని అంటున్నారు హస్తంపార్టీ అభిమానులు. దేందో కలిపి వండితే దాని మాదిరిగా రుచి మార్చుకోవడం అంటే అవకాశవాద లక్షణం. కాంగ్రెస్ పార్టీ అలాంటి అవకాశవాద పార్టీ కాదు. స్థిరత్వం, స్థిరబుద్ధి ఉన్న పార్టీ. బీజేపీ(BJP)లా చంచలత్వం ఉన్న పార్టీ కాదు అని మోదీకి కౌటర్లు ఇస్తున్నారు. కాకరకాయ చేదుగా ఉండవచ్చు కానీ అది ఆరోగ్యానికి చాలా చాలా మందిది. రుచి కోసం దాన్ని వండుకుంటారనుకుంటున్నారు మోదీ. కాదు , అది ఆరోగ్యానికి మేలు చేస్తుంది కాబట్టి. ఆ మాటకొస్తే కాకరకు మించి మన ఆరోగ్యానికి మేలు చేసే మరో కూరగాయ ఉందా? కాంగ్రెస్ పార్టీ కూడా అంతే.. అది దేశానికి మేలు చేస్తుంది. అంటూ మోదీపై విరుచుకుపడుతున్నారు. ఎన్నికలు సమీపిస్తుండటంతో ప్రచార ఉధృతిని పెంచారు మోదీ. కానీ ప్రచారంలో తమ ప్రభుత్వ ఘనతలను చెప్పుకోవడానికి ఏమీ లేదు. అందుకే కాంగ్రెస్‌ను ఇంకా విమర్శిస్తున్నారు. పదేళ్ల నుంచి అధికారంలో లేని కాంగ్రెస్‌పై ఇంకా నిందలు వేయడమేమిటి? ఇప్పటకీ దేశంలో ఉన్న సమస్త అవ్యవస్థలకు మూలం కాంగ్రెస్ మాత్రమేనని అరిగిపోయిన రికార్డును వేస్తున్నారు మోదీ. పదేళ్ల నుంచి అధికారంలో ఉన్న మోదీ ఈ అవ్యవస్థలను సరిదిద్దాలి కదా! ఇంకా కాంగ్రెస్‌పై విమర్శలు చేయడం ఎందుకన్నది సామాన్యుల సందేహం!