వేములవాడలో(Vemulawada) ఎన్నికల ప్రచారంలో పాల్గొన్న ప్రధాని మోడీ(Pm modi) తొలిసారిగా అదానీ(adani), అంబానీలను(ambani) విమర్శించారు. అదానీ, అంబానీలు కాంగ్రెస్‌ పార్టీకి(congress) టెంపోల నిండా డబ్బులు పంపిస్తున్నాయని మోడీ ఆరోపణలపై బీఆర్‌ఎస్‌(BRS) వర్కింగ్‌ ప్రెసిడెంట్‌ కేటీఆర్(KTR) ఘాటుగా స్పందించారు. వేములవాడ ప్రచారంలో అంబానీ, అదానీని మోడీ విమర్శిస్తూ ‘తెలంగాణ గడ్డ నుంచి నేను ఒకటి అడగాలనుకుంటున్నా.

వేములవాడలో(Vemulawada) ఎన్నికల ప్రచారంలో పాల్గొన్న ప్రధాని మోడీ(Pm modi) తొలిసారిగా అదానీ(adani), అంబానీలను(ambani) విమర్శించారు. అదానీ, అంబానీలు కాంగ్రెస్‌ పార్టీకి(congress) టెంపోల నిండా డబ్బులు పంపిస్తున్నాయని మోడీ ఆరోపణలపై బీఆర్‌ఎస్‌(BRS) వర్కింగ్‌ ప్రెసిడెంట్‌ కేటీఆర్(KTR) ఘాటుగా స్పందించారు. వేములవాడ ప్రచారంలో అంబానీ, అదానీని మోడీ విమర్శిస్తూ ‘తెలంగాణ గడ్డ నుంచి నేను ఒకటి అడగాలనుకుంటున్నా. గడచిన ఐదేండ్లుగా అదానీ, అంబానీలపై విమర్శలు గుప్పించిన కాంగ్రెస్‌.. ఎన్నికల ప్రక్రియ మొదలు కాగానే ఎందుకు మౌనంగా ఉందని ప్రశ్నించారు. అదానీ, అంబానీ నుంచి ఎన్ని టెంపో లోడ్ల ధనం ముట్టింది..? ఏం ఒప్పందం కుదిరింది..? రాత్రికి రాత్రే అంబానీ, అదానీలపై ఆరోపణలు ఆగిపోయాయి’ అని ప్రధాని మోదీ ప్రశ్నించిన విషయం తెల్సిందే. ఈ నేపథ్యంలో కేటీఆర్‌ ఎక్స్‌ వేదిగా స్పందించారు. అదేవిధంగా నోట్ల రద్దు విఫల ప్రయత్నమని ప్రధాని మోదీ భావిస్తున్నారా అంటూ ప్రశ్నించారు. ఈడీ, సీబీఐ, ఐటీలను వేటకుక్కల్లాగా వాడుకున్న మీరు మరి కాంగ్రెస్‌కు డబ్బు పంపిస్తుంటే ఎందుకు పట్టుకోలేదని మోడీని కేటీఆర్‌ ఎదురు ప్రశ్నించారు. మీ వేట కుక్కలైన ఈడీ, సీబీఐ, ఐటీ ఎక్కడ పడుకున్నాయని ఎక్స్‌ ద్వారా అడిగారు.

Updated On 9 May 2024 5:18 AM GMT
Ehatv

Ehatv

Next Story