ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ(PM Narendra Modi) నేడు కర్ణాటక(Karnataka) పర్యటనలో ఉన్నారు. ప‌ర్య‌ట‌న‌లో భాగంగా రాష్ట్రంలోని బందీపూర్ ముదుమ్‌లాల్ టైగర్ రిజర్వ్‌(Bandipur Tiger Reserve) కు చేరుకున్నారు. పులులను రక్షించేందుకు 50 ఏళ్ల క్రితం ప్రారంభించిన ప్రాజెక్ట్ టైగర్ వార్షికోత్సవం సందర్భంగా ఏర్పాటు చేసిన‌ కార్యక్రమాల‌కు ప్రధాని హాజ‌రుకానున్నారు. ఈ కార్య‌క్ర‌మంలో ప్ర‌ధాని దేశంలోని పులుల డేటా గణాంకాలను విడుదల చేయనున్నారు. ఉదయం 11 గంటలకు పులుల గణన గణాంకాలను విడుదల చేయనున్నారు. పులుల‌ సంరక్షణ […]

ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ(PM Narendra Modi) నేడు కర్ణాటక(Karnataka) పర్యటనలో ఉన్నారు. ప‌ర్య‌ట‌న‌లో భాగంగా రాష్ట్రంలోని బందీపూర్ ముదుమ్‌లాల్ టైగర్ రిజర్వ్‌(Bandipur Tiger Reserve) కు చేరుకున్నారు. పులులను రక్షించేందుకు 50 ఏళ్ల క్రితం ప్రారంభించిన ప్రాజెక్ట్ టైగర్ వార్షికోత్సవం సందర్భంగా ఏర్పాటు చేసిన‌ కార్యక్రమాల‌కు ప్రధాని హాజ‌రుకానున్నారు. ఈ కార్య‌క్ర‌మంలో ప్ర‌ధాని దేశంలోని పులుల డేటా గణాంకాలను విడుదల చేయనున్నారు. ఉదయం 11 గంటలకు పులుల గణన గణాంకాలను విడుదల చేయనున్నారు. పులుల‌ సంరక్షణ కోసం అమృత్ కాల్ విజన్ ను విడుదల చేస్తారు. అలాగే 'ఇంటర్నేషనల్ బిగ్ క్యాట్స్ అలయన్స్' ఐబిసిఎను కూడా ప్రారంభిస్తారు.

బందీపూర్ టైగర్ రిజర్వ్‌కు చేరుకున్న మోదీ.. ఖాకీ ప్యాంటు, టీ-షర్ట్ పై అడ్వెంచర్ గిలెట్ స్లీవ్‌లెస్ జాకెట్‌ ధరించి కనిపించారు. భారతదేశంలోని అగ్రశ్రేణి పులుల అభయారణ్యాలలో ఒకటిగా ఉన్న బందీపూర్ టైగర్ రిజర్వ్‌ను సందర్శించిన మొదటి ప్రధానిగా మోదీ నిలిచారు. కార్య‌క్ర‌మంలో భాగంగా ఫ్రంట్‌లైన్ ఫీల్డ్ స్టాఫ్, పులుల‌ పరిరక్షణ కార్యకలాపాలలో పాల్గొన్న స్వయం-సహాయ సిబ్బందితో ప్ర‌ధాని సంభాషిస్తారు. ముదుమలై టైగర్ రిజర్వ్‌లోని తెప్పకడు ఏనుగుల శిబిరాన్ని కూడా ప్రధాని సందర్శించనున్నారు. ఏనుగుల శిబిరంలోని మహౌట్‌లు, కావడిలతో ప్ర‌ధాని సంభాషించనున్నారు.

ప్ర‌ధాని మోదీ ప్ర‌స్తుతం దక్షిణ భారత దేశ‌(South India) పర్యటనలో ఉన్నారు. రెండో రోజు పర్యటనలో భాగంగా నేడు ఆయన కర్ణాటకలో ఉన్నారు. అంతకుముందు శనివారం తెలంగాణ(Telangana), తమిళనాడు(Tamilnadu) లో వేర్వేరు కార్యక్రమాల్లో ప్రధాని పాల్గొన్నారు. ఆదివారం ప్రధాని కర్ణాటకలో పలు కార్యక్రమాల్లో పాల్గొననున్నారు. ఈ సందర్భంగా ఆయన ఎన్నికల ర్యాలీలో కూడా ప్రసంగించనున్నారు. 2014లో మోదీ ప్రధాని అయిన తర్వాత.. ఒక‌ ఏడాదిలో అత్యధికంగా.. నాలుగు నెలల్లో కర్ణాటక రాష్ట్రానికి రావడం ఇది ఎనిమిదోసారి.

Updated On 8 April 2023 11:04 PM GMT
Yagnik

Yagnik

Next Story