ప్రధానమంత్రి నరేంద్ర మోదీ(PM Modi) వెనకాల నడవడానికే బీజేపీ(BJP) పెద్దలు భయపడతారు. అలాంటిది పక్కనే ఉంటే మోద సహిస్తారా? సహించడం కాదు, భరించలేరు. మోదీ వంతెన ప్రారంభించినా, రోడ్డు ప్రారంభించినా చివరాఖరికి రామమందిరాన్ని ప్రారంభించినా అంతటా తనే ఉండాలి. చుట్టుపక్కల ఎవరూ ఉండకూడదు.

ప్రధానమంత్రి నరేంద్ర మోదీ(PM Modi) వెనకాల నడవడానికే బీజేపీ(BJP) పెద్దలు భయపడతారు. అలాంటిది పక్కనే ఉంటే మోద సహిస్తారా? సహించడం కాదు, భరించలేరు. మోదీ వంతెన ప్రారంభించినా, రోడ్డు ప్రారంభించినా చివరాఖరికి రామమందిరాన్ని ప్రారంభించినా అంతటా తనే ఉండాలి. చుట్టుపక్కల ఎవరూ ఉండకూడదు. ఆయన మనసెరిగిన వారు అటువైపు వెళ్లడానికి సాహసించరు. తెలియనివారు వెళ్లారే అనుకోండి. అంతే సంగతులు. ఇదంతా ఎందుకు చెప్పాల్సి వస్తున్నదంటే బీజేపీ జాతీయ మాజీ అధ్యక్షుడు, కేంద్ర మంత్రి నితిన్‌ గడ్కరీ ఎక్కడ తనను దాటేసుకుంటూ ముందుకు వెళ్లిపోతారోనన్న భయం నరేంద్రమోదీకి పట్టుకుంది. చాన్నాళ్లుగా ఇద్దరి మధ్య ప్రచ్చన్న యుద్ధం జరుగుతోంది. ఆ మధ్యన గడ్కర్‌ చేసిన కొన్ని వ్యాఖ్యలు ఆయన నిర్వేదానికి అద్దపట్టాయి. బీజేపీలో ఇంతకాలం నరేంద్రమోదీ, అమిత్ షా మాటలే చెల్లాయి. వారు ఎంత చెబితే అంత! పార్టీలో మోదీ-షాలదే పెద్తనం. గడ్కర్‌ వారిద్దరికి చెక్‌ పెట్టబోతున్నారంటూ వార్తలు వస్తున్నాయి. పార్టీలో గత కొన్ని రోజులుగా జరుగుతున్న పరిణామాలు చూస్తుంటే అలాగే అనిపిస్తోంది.

మోదీ-షాలకు గడ్కరీ అంటే అసలు పడదన్న విషయం అందరికీ తెలుసు. తమకు నచ్చని వారిని వారిద్దరు ఇన్ని ఇబ్బందులు పెట్టారో మనం చూశాం కూడా! అద్వానీనే పక్కన పెట్టేసిన వీరికి మామూలు వారు ఓ లెక్కా? కానీ గడ్కరీ మామూలు వ్యక్తి కాదు. అందుకే గడ్కరీని ఎలాగైనా సరే అణగదొక్కాలన్నది మోదీ, షాల భావన అని మీడియాలో వచ్చింది. నాగపూర్‌(Nagpur)లో గడ్కరీ(nitin gadkari)ని ఓడించడానికి మోదీ, అమిత్ షా, ఫడ్నవీస్‌(Fadnavis) కలిసి పని చేశారంటూ శివసేన (ఉద్దవ్‌ థాక్రే) నాయకుడు సంజయ్‌ రౌత్‌ చేసిన వ్యాఖ్యలు సంచలనం రేపుతున్నాయి. గడ్కరీకి అనుకూలవర్గంగా చెప్పుకొనే 1.5 లక్షల మంది నాగ్‌పూర్‌ ఓటర్ల పేర్లు జాబితాలో కనిపించకపోవడానికి ఇదే కారణం. ఎన్నికల సమయంలో అంతటా తిరిగిన మోదీ గడ్కరీ నియోజకవర్గంలో మాత్రం అడుగుపెట్టలేదు. ఆయనకు మద్దతుగా ఎలాంటి ప్రచారం చేయలేదు. పోనీ అమిత్‌ షా అయినా చేయవచ్చు కదా! ఆయన ఆ పని చేయలేదు. పైగా బీజేపీ స్టార్‌ క్యాంపెయినర్ల జాబితాలో నితిన్‌ గడ్కరీ పేరును కూడా మోదీ తొలగించారు. జరుగుతున్నదేమిటో గడ్కరీకి కూడా అర్థమయ్యింది. తనను ఓడించడానికి మోదీ, షాలు ప్రయత్నిస్తున్నారన్న విషయం గడ్కరీ తెలుసుకున్నారు.

ఇంతకాలంలో తనతో ప్రచ్ఛన్న యుద్ధం చేసిన మోదీ-షాలు ఇప్పుడు నేరుగా ప్రత్యక్ష యుద్ధానికే దిగారని విశ్వసనీయ వర్గాల ద్వారా తెలుసుకున్నారు గడ్కరీ. ఎన్నికల ఫలితాలు వచ్చిన తర్వాత గడ్కరీ వర్గం తదుపరి కార్యాచరణకు దిగవచ్చు. ఇందుకోసం ఇప్పటి నుంచే గడ్కరీ ఆర్‌ఎస్‌ఎస్‌ కీలక నేతలను సంప్రదిస్తున్నారట! బీజేపీలో పాత కాపులకు మోదీ, షాల పెత్తనం అసలు ఇష్టం కావడం లేదు. అయినా భరిస్తూ వస్తున్నారు. ఒక్క గడ్కరీ మాత్రమే మోదీ-షా వ్యవహారశైలిని తప్పుపడుతూ వస్తున్నారు. మౌలిక సదుపాయాల్లో అద్భుతాలు చేయవచ్చని,కాకపోతే కేంద్రసర్కారు సకాలంలో స్పందించకపోవడంతో ఇది జరగడం లేదని 2022లో మోదీ ప్రభుత్వం గడ్కరీ విమర్శలు గుప్పించారు. వాజపేయి, అద్వానీ, దీన్‌దయాళ్‌ కృషి వల్లే కేంద్రంలో బీజేపీ అధికారంలోకి వచ్చిందని సంచలన వ్యాఖ్యలు చేశారు. అధికారం కోసమే రాజకీయాలు చేస్తున్నారని, వాడుకొని వదిలేయడమే ప్రధానమయ్యిందని ఆవేదన చెందారు. ఇవన్నీ మనసులో పెట్టుకున్న మోదీ 2022లో బీజేపీ పార్లమెంటరీ బోర్డు నుంచి గడ్కరీని తప్పించారు. పార్టీ ప్రచార కార్యక్రమాలలో ఆయన పాత్ర లేకుండా చేశారు.

కేంద్ర జాతీయ రహదారుల మంత్రిగా ఉన్న గడ్కరీ ఉన్నంతలో బాగానే పని చేశారు. ఆయన హయాంలో హైవేలు కొంత వరకు బాగుపడ్డాయి. అయితే ఈ క్రెడిట్‌ గడ్కరీకి దక్కడాన్ని మోదీ సహించలేకపోయారు. ఇది తమ ప్రభుత్వ ఘనతేనని చాటింపు వేసుకున్నారు. గోది మీడియా కూడా ఇదే ప్రసారం చేసింది. ఇదేసమయంలో సరిగ్గా ఎన్నికల ముందే ద్వారకా ఎక్స్‌ప్రెస్‌ హైవేలో అవసరం లేకపోయినా ఎక్కువ నిధులు ఖర్చు చేశారంటూ కాగ్‌ నివేదిక ఇచ్చింది. కాగ్‌ నివేదిక వెనుక మోదీ హస్తం ఉందనే ఆరోపణలు వస్తున్నాయి. గడ్కరీని ఇబ్బంది పెట్టడానికి మోదీనే ఇదంతా చేశారని బీజేపీలోని కొందరు అంటున్నారు. మహారాష్ట్రకు రావాల్సిన ఫాక్స్‌కాన్‌, ఎయిర్‌క్రాఫ్ట్ తయారీ వంటి పెద్ద పరిశ్రమలను మోదీ గుజరాత్‌కు తరలించుకుపోవడం గడ్కరీని బాధించింది. ఎన్నికల ఫలితాలు కాసింత అటు ఇటు అయితే స్వరం పెంచాలని గడ్కరీ అనుకుంటున్నారు. గడ్కరీనే కాదు, చాలా మంది అసంతృప్తులు తిరుగుబావుటా ఎగరవేయడానికి రెడీగా ఉన్నారు. అయితే మోదీ ప్రధానమంత్రి పదవిని మళ్లీ చేపడితే మాత్రం గడ్కరీ సైలెంటవ్వాల్సి వస్తుంది. అందుకు కారణం 15 ఏళ్ల కిందటి ఓ కేసు ఇంకా గడ్కరీ మెడపై వేలాడుతుండటమే! గడ్కరీ కుమారుడి కారులో ఏడేళ్ల బాలిక మృతదేహం కేసును ఇప్పుడు మోదీ మళ్లీ తెరమీదకు తీసుకువచ్చి గడ్కరీని ఇబ్బంది పెట్టవచ్చు అని అంటున్నారు రాజకీయ విశ్లేషకులు. మోదీ ఇలాంటివి గతంలో చాలా చేశారు. మోదీ తర్వాత ప్రధానమంత్రి ఎవరు? అన్న ప్రశ్నను సంధిస్తూ ది ఎకానమిస్ట్‌ ప్రతిక ఓ కథనం రాసింది. అందులో ముగ్గరు వ్యక్తుల పేర్లను ప్రస్తావించింది. వాటిల్లో గడ్కరీ పేరు కూడా ఉంది. మోదీలో అసహనం కలగడానికి ఇది చాలదూ!

Updated On 31 May 2024 4:22 AM GMT
Ehatv

Ehatv

Next Story