ప్రపంచంలోని చాలా దేశాల్లో ఏదో ఒక గ్రామంలో మహిళలు బట్టలు వేసుకోరనే వార్తలు గతంలో విన్నాం.
ప్రపంచంలోని చాలా దేశాల్లో ఏదో ఒక గ్రామంలో మహిళలు బట్టలు వేసుకోరనే వార్తలు గతంలో విన్నాం. కానీ అలాంటి గ్రామం మనదేశంలో కూడా ఉంది. ఈ గ్రామంలో వింత ఆచారం నడుస్తోంది. ఈ గ్రామంలో మహిళలు ఏడాదికి ఐదు రోజుల పాటు బట్టలు(cloths) వేసుకోరు. గ్రామంలో అనాదిగా వస్తున్న ఆచారాన్ని పాటిస్తున్నామని గ్రామపెద్దలు అంటారు. ఈ గ్రామం హిమాచల్ ప్రదేశ్‌లో(Himachal Pradesh) ఉంది. మణికర్ణలోయ(Manikarnaloya) ప్రాంతంలో పిని(Pini) అనే గ్రామం ఉంటుంది. ఇక్కడ శతాబ్దాలుకు ఈ ఆచారం కొనసాగుతోంది. ఆ ఆచారం ప్రకారం ఏడాదిలో ఐదు రోజులు మహిళలు బట్టలు ధరించారు. ఈ ఐదురోజులు ఇతర గ్రామాల ప్రజలు గ్రామానికి రాకూడదు. ఐదు రోజులు మహిళలంతా ఇళ్లకే పరిమితమవుతారు. ఈ ఐదురోజుల కాలంలో ఇంట్లో మాంసం, మద్యం ఉండదు. భార్యాభర్తలు ఒకరినొకరు మాట్లాడుకోరు. ఈ సంప్రదాయాన్ని ఎవరు పాటించకపోయినా దేవుళ్లు ఆగ్రహం చెందుతారని విశ్వసిస్తారు. ఒకరినొకరు ముట్టుకోరు, ఒకరిని చూసి మరొకరు నవ్వుకోరు కూడా.
అసలు ఎందుకొచ్చింది ఈ ఆచారం అని అడిగితే గ్రామస్తులు ఒక నమ్మకాన్ని వివరించారు. గతంలో తమ గ్రామాన్ని రాక్షసులు స్వాధీనం చేసుకున్నారని, ఆ ఊరి మహిళలను రాక్షసులు తీసుకెళ్లేవారని, ఈ అరాచకం భరించలేక ఎన్నో పూజలు చేయగా గ్రామానికి లాహువా ఘోండ్ అనే దేవుడు ప్రత్యక్షమై రాక్షసులను ఓడించారని చెప్తారు. మహిళలు అందంగా తయారైతే రాక్షసుల దృష్టి మహిళలపై పడుతుందని నమ్ముతారు. ఈ కారణంగానే ఆ ఐదురోజుల పాటు రాక్షసుల కంట పడకుండా ఉండేందుకు బట్టలు వేసుకోకుండా ఇంట్లోనే ఉంటారని చెప్తారు.