అయోధ్య(Ayodhya) రామాలయం(RAm mandir) ప్రారంభోత్సవం కోసం దేశం ఎదురుచూస్తోంది. ఈ నెల 22వ తేదీన జరిగే విగ్రహ ప్రతిష్టాపన కార్యక్రమాన్ని వీక్షించడానికి భక్తులు తరలివెళుతున్నారు. ఇదే సమయంలో విగ్రహ ప్రతిష్టాపన(Idol Installation) కార్యక్రమాన్ని నిలిపివేయాలంటూ అలహాబాద్ హైకోర్టులో(Allahabad High Court) ప్రజాప్రయోజన వ్యాజ్యం(PIL) దాఖలయ్యింది.

Allahabad High Court
అయోధ్య(Ayodhya) రామాలయం(RAm mandir) ప్రారంభోత్సవం కోసం దేశం ఎదురుచూస్తోంది. ఈ నెల 22వ తేదీన జరిగే విగ్రహ ప్రతిష్టాపన కార్యక్రమాన్ని వీక్షించడానికి భక్తులు తరలివెళుతున్నారు. ఇదే సమయంలో విగ్రహ ప్రతిష్టాపన(Idol Installation) కార్యక్రమాన్ని నిలిపివేయాలంటూ అలహాబాద్ హైకోర్టులో(Allahabad High Court) ప్రజాప్రయోజన వ్యాజ్యం(PIL) దాఖలయ్యింది. ఉత్తరప్రదేశ్‌లోని(Uttar Pradesh) ఘజియాబాద్‌కు చెందిన భోలాదాస్ అనే వ్యక్తి ఈ పిటిషన్‌ను దాఖలు చేశారు.
ప్రాణ ప్రతిష్ఠ కార్యక్రమానికి సంబంధించి శంకరాచార్య లేవనెత్తిన అభ్యంతరాలను పిటిషన్‌లో ప్రస్తావించారు. ప్రాణ ప్రతిష్ట కార్యక్రమం సనాతన సంప్రదాయానికి విరుద్ధమని పేర్కొన్నారు. మరో మూడు నెలలో జరగబోయే లోక్‌సభ ఎన్నికల్లో లబ్ధి పొందడానికే మోదీ(Narendra modi) నేతృత్వంలోని బీజేపీ(BJP) ఆలయ ప్రారంభోత్సవానికి ఏర్పాట్లు చేస్తున్నదని పిటిషన్‌లో తెలిపారు. ఈ పిటిషన్‌పై వెంటనే విచారణ జరపాలన్నారు. ఆలయం ఇంకా నిర్మాణ దశలోనే ఉందని తెలిపారు. అసంపూర్తిగా ఉన్న ఆలయంలో ఎలాంటి దేవతా విగ్రహాన్ని ప్రతిష్ఠించకూడదన్నారు.
అలాగే ప్రస్తుతం పుష్కమాసం నడుస్తున్నదని, ఈ మాసంలో ఎలాంటి మతపరమైన కార్యక్రమాలు జరుగవని కోర్టుకు నివేదించారు. పిటిషనర్ న్యాయవాది అనిల్ కుమార్ బింద్ మాట్లాడుతూ ప్రధాని నరేంద్ర మోదీ పాల్గొంటున్న కార్యక్రమాన్ని నిలిపివేయాలని పిల్ దాఖలు చేసినట్లు పేర్కొన్నారు. హైకోర్టులో త్వరగా పిటిషన్ విచారణకు స్వీకరించేలా చూస్తామన్నారు. మరోవైపు, జనవరి 22వ తేదీన భజన, కీర్తనలు నిర్వహించాలని ఉత్తరప్రదేశ్ ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి జారీ చేసిన ప్రభుత్వ ఉత్తర్వులను సవాలు చేస్తూ దాఖలైన పిల్‌ను విచారించేందుకు అలహాబాద్ హైకోర్టు నిరాకరించింది. ఈ ఏడాది ఉత్తరప్రదేశ్‌లోని అన్ని దేవాలయాల్లో భజన-కీర్తనలు నిర్వహించాలని, రామచరిత్ మానస్ పఠించాలని, అన్ని నగరాల్లో రథ, కలశ యాత్ర చేపట్టాలని ప్రభుత్వ ఉత్తర్వులు జారీ చేసింది.
