అతడు ఆర్డర్ ఇచ్చిన ఆహారం తినలేదు. ఉదయం 11.44 గంటల ప్రాంతంలో వాష్ బేసిన్ క్లోసెట్ వద్ద కనిపించాడు.
బెంగళూరు బాంబు పేలుడు నిందితుడు బూడిదరంగు చొక్కా, తెల్లటి టోపీ, ముసుగు ధరించి ప్రముఖ రామేశ్వరం కేఫ్‌లో ఇడ్లీ ప్లేట్‌తో వెళుతుండడం ఫోటో సీసీటీవీలో రికార్డైంది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. బెంగళూరులోని వైట్‌ఫీల్డ్ ప్రాంతంలో శుక్రవారం మధ్యాహ్నం 1 గంట సమయంలో జరిగిన పేలుడులో హోటల్ సిబ్బంది, కస్టమర్‌లతో సహా 10 మంది గాయపడ్డారు. సుమారు 30 సంవత్సరాల వయస్సు ఉన్న నిందితుడు ఉదయం 11.30 గంటల సమయంలో బ్యాగ్‌తో కేఫ్‌కు వచ్చాడు. అతను ఉదయం 11.38 గంటలకు రవ్వ ఇడ్లీని ఆర్డర్ చేశాడు. కేఫ్‌లోని కౌంటర్ పైన ఉంచిన సీసీటీవీ కెమెరాలో అతడు ఆర్డర్ ఇవ్వడం రికార్డు అయింది.
అతడు ఆర్డర్ ఇచ్చిన ఆహారం తినలేదు. ఉదయం 11.44 గంటల ప్రాంతంలో వాష్ బేసిన్ క్లోసెట్ వద్ద కనిపించాడు. ఒక నిమిషం తరువాత, అతను కేఫ్ నుండి బయటకు వెళ్లడం గమనించవచ్చు. మధ్యాహ్నం 12.56 గంటల ప్రాంతంలో పేలుడు జరిగింది. మరో సీసీటీవీ ఫుటేజీలో అనుమానితుడు బ్యాగ్‌తో రెస్టారెంట్ వైపు వెళ్తున్నట్లు కనిపించింది. బ్యాగ్‌లో టైమర్‌ను అమర్చిన ఇంప్రూవైజ్డ్ ఎక్స్‌ప్లోజివ్ డివైజ్ (ఐఈడీ) కారణంగానే పేలుడు సంభవించిందని పోలీసులు అనుమానిస్తున్నారు.శనివారం, నేషనల్ ఇన్వెస్టిగేషన్ ఏజెన్సీ (NIA), నేషనల్ సెక్యూరిటీ గార్డ్ (NSG) సిబ్బంది సంఘటనా స్థలానికి చేరుకున్నారు. రామేశ్వరం కేఫ్ కో-ఫౌండర్, మేనేజింగ్ డైరెక్టర్ దివ్య రాఘవేంద్రరావు అధికారులకు సహకరిస్తున్నామని చెప్పారు.